రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి | Ramya krishna To Play A Role In Rajinikanths Robo 2 | Sakshi
Sakshi News home page

రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి

Published Wed, Jul 13 2016 4:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి

రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి

రజనీకాంత్, రమ్యకృష్ణలది సూపర్ హిట్ జోడి. నరసింహ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నరసింహాగా రజనీ, నీలాంబరిగా రమ్యకృష్ణ పోటి పడి నటించారు. అయితే ఇంత భారీ సక్సెస్ అందించిన ఈ కాంబినేషన్ తరువాత రిపీట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తెరను పంచుకోబోతున్నారు.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్కు రెడీ అవుతుండగా, మరో సినిమా రోబో 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇప్పటికే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, ప్రస్తుతం కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో నటిస్తోంది. ఒకే సమయంలో రజనీ, కమల్ లాంటి టాప్ స్టార్స్తో సినిమాలు చేస్తూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement