
రెండు కోట్లిస్తే చేస్తుందట..?
మదరాసి పట్టణం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా.., నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మదరాసి పట్టణం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా.., నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత వరుసగా తమిళ, హిందీ, తెలుగు సినిమాలతో బిజీ అయ్యింది. అయితే ఈ సినిమాలేవి ఈ అమ్మడికి స్టార్ స్టేటస్ మాత్రం ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం 'ఐ' అమీ జాతకం మార్చేసింది.
ఐ సినిమా భారీ ఫెయిల్యూర్ అయినా అమీకి మాత్రం మంచి క్రెడిట్ దక్కింది. ఈ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న అమీజాక్సన్ అనంతరం వరుస సినిమాలతో మరింత బిజీ అయ్యింది. ప్రస్తుతం తమిళ్లో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రోబో సీక్వల్లోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఈ ఆఫర్తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమీ జాక్సన్ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించాలంటే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో పర్వాలేదనిపించిన రవితేజ, తన నెక్ట్స్ సినిమా కోసం అమీ జాక్సన్ను ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన అమీ, రెమ్యూనరేషన్ మాత్రం 2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. మరి ఇంత భారీ మొత్తం ఇచ్చి ఈ అమ్మడిని హీరోయిన్గా తీసుకుంటారో లేదో చూడాలి.