కవ్వింత | jokes of the week | Sakshi
Sakshi News home page

కవ్వింత

Published Sat, Aug 9 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

jokes of the week

చిత్రం
పనివాడు: అయ్యా, ఈరోజు టీవీలో వచ్చే ‘కడపటి యుద్ధం’ సినిమా చూడొచ్చా?
యజమాని: ఇదేం విచిత్రమైన కోరికరా?
పనివాడు: అది నేను నిర్మించిన తొలి-చివరి సినిమా అయ్యగారు!!!
 
లవ్లీ షాక్
రజని: గౌతమ్, మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు.
గౌతమ్:  నా గురించి నువ్వేం భయపడకు రజని. మా అక్క కూతురు కిరణ్మయి కూడా నన్ను ప్రేమిస్తోంది.
 
ఫ్యామిలీ ప్యాక్
ఎలక్ట్రిసిటీ పాఠం అయ్యాక టీచరు ప్రశ్నలు అడుగుతోంది. నిద్రపోతున్న వెంకట్‌ని లేపి నువ్వు ఏ పాఠం వింటున్నావో చెప్పు అని అడిగింది. పైకి లేచి ‘ఎలక్ట్రికిటీ’ మేడమ్ అన్నాడు. అదేంటి అలా పలుకుతున్నావు రేపు మీ పేరెంట్స్‌ని పిలుచుకురా.
టీచర్: మీ అబ్బాయి ‘ఎలక్ట్రికిటీ’ అని పలుకుతున్నాడేంటి?
తండ్రి: వాడి కెపాక్రిటీ అంతే మేడమ్
టీచరు: మీ ఆయన కూడా అలా మాట్లాడతాడేంటమ్మా?
తల్లి: దీనికి ఇంత ‘పబ్లికిటీ’ అవసరమా? మేడమ్!
                                                                                                                                                                                                                              
కారణం తెలిసింది!
రామ్: ఆ నవల చదివితే కేశాలు నిక్కబొడుచుకుంటాయన్నావు, అదేం లేదే!
శ్యామ్: అది జుట్టున్న వారికి రా, నీకు కాదు.
 
మగ జ్యోతిష్కుడు!

శ్రీలత: నా భర్త క్షేమంగా ఉండాలంటే నేను ఏ నోము చేయాలో చెబుతారా?
జ్యోతిష్కుడు: మూగనోము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement