
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళల హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇటిమరపు రజని ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రజని 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో రజని సభ్యురాలిగా ఉంది. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన మొత్తం 25 మంది క్రీడాకారిణులకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీలో శిబిరం నిర్వహిస్తారు.,