indian sports authority
-
జాతీయ మహిళల హాకీ శిబిరానికి రజని
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళల హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇటిమరపు రజని ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రజని 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో రజని సభ్యురాలిగా ఉంది. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన మొత్తం 25 మంది క్రీడాకారిణులకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీలో శిబిరం నిర్వహిస్తారు., -
మేటి క్రీడాకారులకు ఎన్ఐఎస్ కోర్సులో నేరుగా సీటు
న్యూఢిల్లీ: పాటియాలాలోని జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు మేటి క్రీడాకారులకు నేరుగా అవకాశమిస్తున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. ఈ డిప్లొమా కోర్సుల్లో 46 మంది ఉత్తమ అథ్లెట్లకు స్థానం కల్పి స్తారు. ఎన్ఐఎస్ ప్రవేశ విధానంలోనూ మార్పులు చేశారు. ఆన్లైన్ పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. సీట్ల సంఖ్యను 566 నుంచి 725కి పెంచారు. ‘ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా లేదా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ్య లేకుండా నేరుగా చేర్చుకుంటారు. కోర్సులో చేరడానికి విద్యార్హతను డిగ్రీ నుంచి మెట్రిక్యులేషన్‌కే పరిమితం చేశారు. కనీస వయసును 23 నుంచి 21కి తగ్గించడం జరిగింది. -
‘మీ ఆటకు మీరే బాధ్యులు’
న్యూఢిల్లీ: క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రొత్సహించాల్సిన భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధ్యత మరిచే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) పేరిట నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ‘సాయ్’ తాజాగా ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను సమర్పించాలని ఆటగాళ్లను కోరడం చర్చనీయాంశమైంది. ఆటగాళ్లకు వెన్నంటే మద్దతివ్వాల్సిన సాయ్... ఇప్పుడీ కొత్త నిబంధన జతచేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడేక్రమంలో, శిక్షణ తీసుకునే విషయంతో ‘మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు’అనే డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. -
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
న్యూఢిల్లీ: కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్ కుక్ అమెరికాకు, గ్రీకో రోమన్ కోచ్ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. -
టాప్స్ నుంచి రెజ్లర్ సాక్షి ఔట్
న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌తో పాటు రాహుల్‌ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తొలగించింది. రెజ్లర్ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్‌లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు. క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్ షట్లర్ సైనా నెహా్వల్ తనకు వ్యక్తిగత ట్రెయినర్ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్నెస్ ట్రెయినర్ స్వరూప్ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్’ భరిస్తుంది. -
క్రీడలకు రూ. 2,216 కోట్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమ మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు రూ. 2216.92 కోట్లను కేటాయించింది. గడిచిన ఏడాది కంటే తాజా బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ. 214.20 కోట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్రీడలకు రూ. 2002.72 కోట్లు వెచ్చించింది. బడ్జెట్ వాటాల్లో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి అత్యధికంగా నిధుల్ని కేటాయించింది. ఈ విషయాలను శుక్రవారం ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో వెల్లడించారు. ఇదీ ‘క్రీడల బడ్జెట్’ స్వరూపం ► ‘సాయ్’కి రూ. 450 కోట్లు. గతంలో (రూ. 396 కోట్లు) కంటే రూ. 54 కోట్లను ఎక్కువగా కేటాయించారు. జాతీయ శిబిరాల నిర్వహణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, క్రీడాకారుల ఖర్చులకు వీటిని వెచ్చిస్తారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి గణనీయంగా రూ. 70 కోట్లకు పెంచారు. క్రీడాకారులకు అందించే ఇన్సెంటీవ్స్ కోసం రూ. 89 కోట్లను కేటాయించారు. గతంలో రూ. 63 కోట్లు మంజూరు చేశారు. ►క్రీడాకారుల ప్రోత్సాహకాలు, అవార్డుల్లో భాగంగా ఇచ్చే నగదు బహుమతుల మొత్తాన్ని రూ. 316.93 కోట్ల నుంచి రూ. 411 కోట్లకు పెంచారు. గతంతో పోలిస్తే రూ. 94.07 కోట్లు పెరిగాయి. ► ‘ఖేలో ఇండియా’కు రూ. 601 కోట్లు కేటాయించారు. ఇది గతం (రూ.550.69 కోట్లు) కంటే రూ. 50.31 కోట్లు అదనం. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు చేసే చెల్లింపుల్లో స్వల్పంగా కోత విధించారు. గతంలో రూ. 245.13 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 245 కోట్లకు పరిమితం చేశారు. -
ప్రతిభ కొండంత...గుర్తింపు గోరంత...
♦ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు ♦ యూత్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం ♦ ప్రభుత్వం నుంచి చేయూత శూన్యం ♦ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ ప్రస్థానం ఏ రంగంలోనైనా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభించాలి. లేదంటే ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. ఈ అంశం క్రీడారంగానికీ వర్తిస్తుంది. ఏడేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నా... ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లభించపోతే ఏ క్రీడాకారుడికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. ఒక క్రీడాంశంలో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించగానే భారీ నజరానాలు అందజేయడం... ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతాయి. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం ఆ స్థాయి ఆదరణ, గుర్తింపు లభించకపోవడం విచారకరం. పదేళ్ల క్రితం బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న శ్యామ్ కుమార్ ఏడాది తిరిగేలోపే ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008, 2009, 2010లలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. దాంతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని అందుకొని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. విశాఖపట్నంలోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణ కేంద్రంలో కోచ్ ఐ.వెంకటేశ్వర రావు వద్ద బాక్సింగ్ పాఠాలు నేర్చుకున్న శ్యామ్ అనతికాలంలోనే ఓ మేటి బాక్సర్‌గా రూపుదిద్దుకున్నాడు. నాన్న అర్జున్ కబడ్డీ ప్లేయర్ కావడంతో శ్యామ్‌కు సహజంగానే ఆటలపై ఆసక్తి కలిగింది. తన సోదరుడు సాగర్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్తుండటంతో శ్యామ్ కూడా గ్లౌవ్స్ ధరించి ‘రింగ్’లోకి అడుగు పెడతానని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనయుడి ఆసక్తిని గమనించిన తండ్రి అర్జున్ బాక్సింగ్ శిక్షణకు పంపించారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో ఆరంభంలో కోచ్ అన్నీ తానై శ్యామ్‌కు అండగా నిలిచారు. 2010లో కోల్‌కతాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ స్వర్ణం నెగ్గడంతో... అదే ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఆ టోర్నీలో శ్యామ్ పసిడి పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత శ్యామ్ భారత జూనియర్, యూత్ జట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన జాతీయ పురుషుల ఎలైట్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ రజత పతకం సాధించి సీనియర్ స్థాయిలోనూ తన ముద్ర వేశాడు. సీనియర్ స్థాయిలో 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న 21 ఏళ్ల శ్యామ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నాడు. రైల్వేస్‌లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న శ్యామ్ వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పతకాలు సాధించడమే తన ముందున్న లక్ష్యమని ‘సాక్షి’తో పేర్కొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడం తన జీవితాశయమని వివరించాడు. గత ఏడేళ్లలో జూనియర్, యూత్, సీనియర్ స్థాయిల్లో పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు గెలిచాను. కానీ ఇప్పటి వరకు నా విజయాలను ప్రభుత్వం గుర్తించలేదు. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం పతకాలు గెలిచి ఇక్కడకు వచ్చిన వెంటనే భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ఇస్తున్నారు. ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నారు. వీలైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీలు ఇస్తున్నారు. నాకు మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నగదు పురస్కారాలు అందలేదు. కొంతకాలంగా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు, నాన్న చికిత్సకే సరిపోతోంది. ఇకనైనా ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులను స్థాయీభేదం చూడకుండా సమానంగా గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను. –శ్యామ్ కుమార్ శ్యామ్ కుమార్ ఘనతలు ఈ నెలలో మంగోలియాలో జరిగిన ఉలాన్బాటర్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో కాంస్య పతకం. గత ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం. 2015 డిసెంబరులో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో కాంస్య పతకం. 2015 ఏప్రిల్‌లో థాయ్‌లాండ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం. 2014 ఆగస్టులో చైనాలోని నాన్జింగ్లో జరిగిన యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో ఐదో స్థానం. 2014 ఏప్రిల్‌లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. 2013లో అజర్బైజాన్లో జరిగిన అంతర్జాతీయ యూత్ టోర్నీలో స్వర్ణం. 2012లో అజర్బైజాన్లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో రజతం. 2010లో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో స్వర్ణం. -
నూతన ‘సాయ్’ పాలక కమిటీ సభ్యులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) పాలక కమిటీ సభ్యులుగా ఇటీవల నియమితులైన వారిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శనివారం ఘనంగా సన్మానించింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులు పాల్గొన్నారు. ఇటీవలే వీరు ముగ్గురు రాష్ట్ర సాయ్ పాలక కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.