మేటి క్రీడాకారులకు ఎన్‌ఐఎస్‌ కోర్సులో నేరుగా సీటు  | Direct NIS Diploma Seats For World Champions And Athletes | Sakshi
Sakshi News home page

మేటి క్రీడాకారులకు ఎన్‌ఐఎస్‌ కోర్సులో నేరుగా సీటు 

Published Thu, May 28 2020 12:09 AM | Last Updated on Thu, May 28 2020 12:09 AM

Direct NIS Diploma Seats For World Champions And Athletes - Sakshi

న్యూఢిల్లీ: పాటియాలాలోని జాతీయ క్రీడా సంస్థ (ఎన్‌ఐఎస్‌)లో కోచింగ్‌ డిప్లొమా కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు మేటి క్రీడాకారులకు నేరుగా అవకాశమిస్తున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. ఈ డిప్లొమా కోర్సుల్లో 46 మంది ఉత్తమ అథ్లెట్లకు స్థానం కల్పి స్తారు. ఎన్‌ఐఎస్‌ ప్రవేశ విధానంలోనూ మార్పులు చేశారు. ఆన్‌లైన్‌ పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. సీట్ల సంఖ్యను 566 నుంచి 725కి పెంచారు. ‘ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా లేదా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ్య లేకుండా నేరుగా చేర్చుకుంటారు. కోర్సులో చేరడానికి విద్యార్హతను డిగ్రీ నుంచి మెట్రిక్యులేషన్‌కే పరిమితం చేశారు.  కనీస వయసును 23 నుంచి 21కి తగ్గించడం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement