ఫ్రాన్స్‌కు చెందిన కెవిన్ పియెట్ అనే దివ్యాంగ టెన్నిస్ క్రీడాకారుడు పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల కెవిన్ 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ల స్పర్శను కోల్పోయాడు. పక్షవాతం కారణంగా కెవిన్ రెండు కాళ్లు పని చేయడం లేదు. కెవిన్.. తాను సొంతంగా నడవలేకపోయినా రోబిటిక్ యంత్రం (Exoskeleton) సాయంతో నడుస్తూ ఒలింపిక్స్ జ్యోతిని మోసాడు.
Kevin Piette, paraplegic since an accident, made history today by carrying the Olympic flame with his exoskeleton! 💪
pic.twitter.com/oejQHQRAwG— Kevin W. (@Brink_Thinker) July 23, 2024
ఎక్సోస్కెలిటన్ సాయంతో టార్చ్ బేరర్‌గా నిలవడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. కెవిన్ పక్షవాతం బారిన పడ్డాక పారా అథ్లెట్‌గా (వీల్ చైర్ టెన్నిస్) కొనసాగుతున్నాడు. కెవిన్ ఎక్సోస్కెలిటన్ సాయంతో తన రోజువారీ పనులు తానే చేసుకోవడంతో పాటు టెన్నిస్‌లో తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దివ్యాంగ క్రీడాకారులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడే సైబాథ్లాన్ పోటీల్లోనూ కెవిన్ పాల్గొన్నాడు.
కాగా, 2024 పారిస్ ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై 26న జరిగే ఓపెనింగ్ సెర్మనీతో విశ్వ క్రీడలు మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 206 దేశాల నుంచి 10, 714 క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఆగస్ట్ 10న విశ్వ క్రీడలు ముగుస్తాయి. 32 క్రీడలకు సంబంధించి 329 విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయి.
భారత్ నుంచి ఈ సారి ఒలింపిక్స్‌లో 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత బృందానికి టార్చ్ బేరర్లుగా పీవీ సింధు, శరత్ కమల్ వ్యవహరించనున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత ప్రస్తానం రేపటి నుంచి జరుగబోయే ఆర్చరీ పోటీలతో మొదలవుతుంది. జులై 27న బ్యాడ్మింటన్, బాక్సింగ్.. ఆగస్ట్ 1-10 వరకు అథ్లెటిక్స్.. జులై 27- ఆగస్ట్ 8 వరకు హాకీ పోటీలు, జులై 27- ఆగస్ట్ 5 వరకు షూటింగ్ పోటీలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment