Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన అమన్‌ సెహ్రావత్‌.. పతకానికి అడుగు దూరంలో..! | Paris Olympics 2024: Aman Sehrawat Enters Semi Finals | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన అమన్‌ సెహ్రావత్‌.. పతకానికి అడుగు దూరంలో..!

Published Thu, Aug 8 2024 4:35 PM | Last Updated on Thu, Aug 8 2024 5:00 PM

Paris Olympics 2024: Aman Sehrawat Enters Semi Finals

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్‌ ఫైనల్లో సెహ్రావత్‌.. అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్‌ అబాకరోవ్‌పై 12-0 తేడాతో గెలుపొందాడు. 

ఇవాళ (ఆగస్ట్‌ 8) రాత్రే జరిగే సెమీఫైనల్లో సెహ్రావత్‌.. జపాన్‌కు చెందిన రె హిగుచితో తలపడతాడు. ఈ బౌట్‌లో సెహ్రావత్‌ గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. భారత కాలమానం ప్రకారం సెమీఫైనల్‌ బౌట్‌ రాత్రి 9:45 గంటలకు ప్రారంభమవుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement