world champions
-
ప్రపంచ ఛాంపియన్లు వీళ్లే.. ఓ క్రీడాంశంలో భారత్ కూడా..!
వివిధ క్రీడాంశాల్లో (పురుషులు) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లపై (టీమ్ గేమ్స్) ఓ లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే 17 రకాల క్రీడల్లో 17 దేశాలకు చెందిన జట్లు జగజ్జేతలుగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో భారత్ కూడా ఉంది. క్యారమ్స్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. ఈ జాబితాలో యూఎస్ఏ అత్యధికంగా మూడు క్రీడాంశాల్లో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. గోల్ఫ్, లాక్రాస్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో యూఎస్ఏ డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. యూఎస్ఏ తర్వాత స్పెయిన్ అత్యధికంగా రెండు క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. స్పెయిన్ బాస్కెట్‌బాల్, టెన్నిస్‌లలో వరల్డ్ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. పాకిస్తాన్ సైతం ఓ క్రీడాంశంలో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. కబడ్డీలో పాక్ జగజ్జేతగా ఉంది. వివిధ క్రీడల్లో వరల్డ్ ఛాంపియన్లు (పురుషులు).. క్యారమ్స్: భారత్ క్రికెట్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్: అర్జెంటీనా గోల్ఫ్: యూఎస్ఏ లాక్రాస్: యూఎస్ఏ అమెరికన్ ఫుట్‌బాల్: యూఎస్ఏ టెన్నిస్: స్పెయిన్ బాస్కెట్‌బాల్: స్పెయిన్ బ్యాడ్మింటన్: డెన్మార్క్ కబడ్డీ: పాకిస్తాన్ చెస్: నార్వే హాకీ: జర్మనీ వాలీబాల్: బ్రెజిల్ బేస్‌బాల్: జపాన్ రగ్భీ: సౌతాఫ్రికా సాఫ్ట్‌బాల్: ఆస్ట్రేలియా టేబుల్ టెన్నిస్: చైనా -
మేటి క్రీడాకారులకు ఎన్ఐఎస్ కోర్సులో నేరుగా సీటు
న్యూఢిల్లీ: పాటియాలాలోని జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు మేటి క్రీడాకారులకు నేరుగా అవకాశమిస్తున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. ఈ డిప్లొమా కోర్సుల్లో 46 మంది ఉత్తమ అథ్లెట్లకు స్థానం కల్పి స్తారు. ఎన్ఐఎస్ ప్రవేశ విధానంలోనూ మార్పులు చేశారు. ఆన్లైన్ పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. సీట్ల సంఖ్యను 566 నుంచి 725కి పెంచారు. ‘ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా లేదా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ్య లేకుండా నేరుగా చేర్చుకుంటారు. కోర్సులో చేరడానికి విద్యార్హతను డిగ్రీ నుంచి మెట్రిక్యులేషన్‌కే పరిమితం చేశారు. కనీస వయసును 23 నుంచి 21కి తగ్గించడం జరిగింది. -
అథ్లెటిక్స్‌లోనూ లీగ్!
న్యూఢిల్లీ: ఐపీఎల్, ఐబీఎల్ తరహాలో భారత్‌లో మరో కొత్త లీగ్‌కు తెరలేవబోతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఇండియన్ అథ్లెటిక్స్ లీగ్ (ఐఏఎల్) పేరిట భారీ ఎత్తున పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్లను ఈ పోటీల్లో బరిలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో లీగ్ సాధ్యసాధ్యాలపై చర్చించారు. ఈ ప్రతిపాదిత లీగ్‌లో 8 నుంచి 10 ఫ్రాంచైజీలు ఉండే అవకాశం ఉంది. ఒక్కో జట్టులో 16 (8 పురుషులు, 8 మహిళలు) మంది అథ్లెట్లు ఉంటారు. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు అంతర్జాతీయ అథ్లెట్లకు అవకాశం ఉంటుంది. అథ్లెట్లకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ మొత్తం లీగ్‌కు రూ. 100 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.