న్యూఢిల్లీ: ఐపీఎల్, ఐబీఎల్ తరహాలో భారత్‌లో మరో కొత్త లీగ్‌కు తెరలేవబోతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఇండియన్ అథ్లెటిక్స్ లీగ్ (ఐఏఎల్) పేరిట భారీ ఎత్తున పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్లను ఈ పోటీల్లో బరిలోకి దించాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో లీగ్ సాధ్యసాధ్యాలపై చర్చించారు. ఈ ప్రతిపాదిత లీగ్‌లో 8 నుంచి 10 ఫ్రాంచైజీలు ఉండే అవకాశం ఉంది. ఒక్కో జట్టులో 16 (8 పురుషులు, 8 మహిళలు) మంది అథ్లెట్లు ఉంటారు. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు అంతర్జాతీయ అథ్లెట్లకు అవకాశం ఉంటుంది. అథ్లెట్లకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ మొత్తం లీగ్‌కు రూ. 100 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
అథ్లెటిక్స్‌లోనూ లీగ్!
Published Wed, Jan 8 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement