'భారతరత్న' నా తల్లికి అంకితం: సచిన్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన 'భారతరత్న' అవార్డును తన తల్లి రజనికి అంకితం చేస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ఈరోజే తన క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను సచిన్ టెండూల్కర్, సైన్స్లో విశేష సైవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావులకు ఈరోజు భారత తర్న ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. అంతకు ముందు క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రికెట్ వైపు నడిపించిన తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు. అమ్మ ప్రార్థనలే తనని ఈస్థాయికి చేర్చాయని చెప్పారు. ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అయ్యేందుకు కుటుంబమే కారణమన్నారు.