
కబాలి 'పది' నిజాలు
పంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరిస్తున్న కబాలి ఫీవర్ పై ముఖ్యమైన పది సంగతులు సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.
ముంబై: టీజర్ లోనే కబాలి రా.. అంటూ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకి వచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి, కోట్లలో వ్యాపారాన్ని గడించిన ఈ సూపర్ మూవీపై అంచనాలు అంతకంటే భారీగా నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించిన కబాలి ఫీవర్ సృష్టించే రికార్డులపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కబాలి సినిమాకు సంబంధించి ముఖ్యమైన పది సంగతులు సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.
- దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక కొత్త టీమ్ తో రజనీకాంత్ కలిసి పనిచేయడం
- రజనీకాంత్ తాజా సినిమాలో గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణం పాడిన పాట లేకపోవడం
- సైన్ ఫిక్షన్ ..సూపర్ నేచురల్ ఫిలిం
- ఓ డాన్ నిజ జీవిత గాథ అధారంగా రూపొందించిన చిత్రం
- థ్యాంక్స్ టు సౌందర్య రజనీకాంత్. మూడో సినిమాతోనే సూపర్ స్టార్ రజనీ సినిమాకు దర్మకత్వం వహించాడు పా రంజిత్, అయితే ఆయనను రజనీకాంత్ కూ పరిచయం చేసిన ఘనత కూతురికి సౌందర్యకు దక్కుతుంది. సో. ..కబాలిని ఇంత గొప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా సౌందర్యదే.
- మరోవైపు సినిమా మొదలైన పావుగంట తర్వాత హీరో తలైవా తెరమీద ఆవిష్కారం.
- మామూలు రజనీకాంత్ స్టయిల్ విన్యాసాలు.. పంచ్ డైలాగులు.. ఈ సినిమాలో లేవు.
- ట్రైయిలర్స్ లేవు.
- మలేషియన్ ప్రభుత్వం రజనీకాంత్ పట్ల గౌరవ సూచకంగా ఒక స్పెషల్ స్టాంప్ ను విడుదల చేసింది.
- మలేషియాలో భారీగా రిలీజవున్న తొలి భారతీయ సినిమా కబాలి. సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగా మలేషియాలో జరగడంతో అక్కడకూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
కబాలి సృష్టించిన మేనియా ఇంతేనా ఇంకా చాలా ఉంది. గూగుల్ స్పెషల్ యాప్, ఓ ప్రయివేటు విమానయానసంస్థరూపొందించిన స్పెషల్ విమానం, ముత్తూట్ ఫినాన్స్ వారి వెండినాణాలు, దబ్ స్మాష్ వీడియో కాంపిటీషన్, కోయంబత్తరూ లో ఒక కఫే రజనీ కి డెడికేట్ .. ఇలా చాలా ప్రత్యేకతలే వున్నాయి. మరి కలెక్షన్ల వసూళ్లలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పనుందో వేచి చూడాలి.