వినోదమే కరువైన కాలంలో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతామంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ నాల్గో సీజన్. కరోనా వల్ల ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా? లేదా అనుకునే సమయంలో షో అట్టహాసంగా ప్రారంభమై అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇక ప్రీమియర్ ఎపిసోడ్‌తోనే రికార్డులు బద్ధలు కొట్టిన ఈ షో మొదట్లో నత్తనడకగా సాగినప్పటికీ, రానురానూ వినోదాల విందును పంచుతూ ప్రేక్షకుల ఫేవరెట్‌గా నిలుస్తోంది. స్నేహగీతాలకు సరిహద్దులు చెరిపేస్తూనే కలహ భోజనాలకు కొరత లేకుండా అన్ని ఎమోషన్స్‌ను ఒకే విస్తరిలో సరిసమానంగా వడ్డిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణను చూరగొంటున్న ఈ బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రయాణం ముగింపుకు వస్తోంది.
క్రిస్‌మస్ పండగకు ముందే..
ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే కోసం నిర్వాహకులు అప్పుడే ప్రణాళికలు మొదలు పెట్టేశారట. ఆఖరి ఎపిసోడ్‌కు అతిథులుగా ఎవరెవర్ని పిలవాలి? ఫైనల్‌లో ఎలాంటి కఠినతరమైన గేమ్స్ ప్రవేశపెట్టాలి? ఎవరి చేతుల మీదుగా ట్రోఫీ అందిచాలి? వంటివాటిపై సమాలోచనలు జరుపుతున్నారట. అంతే కాకుండా పెరుగుతున్న టీఆర్పీ రేటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని షోను మరో రెండు వారాలు పొడిగించే ఆలోచనలో బిగ్‌బాస్ టీమ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20న జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది నాగార్జునే చెప్పాలి. (చదవండి: మీరు అనుమతిస్తే హారికను తీసుకెళ్లిపోతా: అభిజిత్)
పంతొమ్మిది మందిలో 8 మందే మిగిలారు
కాగా ఇప్పటివరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే మొదటి సీజన్‌లో విజేతకు జూనియర్ ఎన్టీఆర్ ట్రోఫి అందించగా, రెండో దాంట్లో వెంకటేష్, మూడో సీజన్‌లో చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక నాల్గో సీజన్‌లో పంతొమ్మిది కంటెస్టెంట్లు పాల్గొనగా పదకొండో వారం ముగింపుకు వచ్చేసరికి కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో అభిజిత్, సోహైల్, హారిక, అరియానా, మోనాల్, లాస్య నామినేషన్‌లో ఉండగా మోనాల్, లాస్య డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ పోల్స్ అన్నీ కూడా మోనాల్ బ్యాగు సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జోస్యం చెప్తున్నాయి. అయితే నో ఎలిమినేషన్, రీ ఎంట్రీ వంటి అద్భుతాలు జరిగితే మాత్రం వీరికి గండం గట్టెక్కినట్టే. (చదవండి: అభిజిత్‌కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి)
Comments
Please login to add a commentAdd a comment