
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన “ఆటా నాదం” పాటల పోటీల్లో ఫైనల్ రౌండ్‌లో 13 మంది గాయనీగాయకులు పాల్గొనగా.. విజేతలుగా ప్రథమ స్థానంలో కే ప్రణతి, ద్వితీయ స్థానంలో దాసరి మేఘన నాయుడు, తృతీయ స్థానంలో వెంకట సాయి లక్ష్మి, పాసాల హర్షిత, అవసరాల అభినవ్‌లు నిలిచారు. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహారించారు.
ఆటా మహాసభల సన్నహాక కార్యక్రమములో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీగాయకులకు ప్రోత్సహాం అందించేందుకు ఆటా నాదం పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 200ల మంది గాయనీ గాయకులు పాల్గొన్నారు. రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” సాంస్కృతిక కార్యక్రములో విజేతలకు పాడే అవకాశం ఆటా కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment