singing performance
-
తెలుగు ఇండియన్ ఐడల్.. స్వరాల జల్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగింగ్ కాంపిటిషన్ ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు చెందిన సింగర్ గీతా గ్యాంగ్స్టర్స్, కార్తీక్ కిలాడీలు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్రెండ్ సెట్టర్స్ నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో పాటలతో సందడి చేశారు. ఈ లైవ్ మ్యూజిక్ ఈవెంట్లో యువ సింగర్స్ సాయి వల్లభ, భరత్, అనిరుధ్, నజీర్, అభిజ్ఞలు తమ సంగీత స్వరాలతో యూనివర్సిటీ విద్యార్థులను అలరించారు. ఇందులో భాగంగానే వారి స్ఫూర్తిదాయక వ్యక్తిగత ప్రయాణాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. -
సరిగమప లిటిల్ చాంప్స్ విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి జెట్షెన్ దోహ్నా నిలిచింది. సిక్కింకు చెందిన ఈ చిన్నారి లిటిల్ చాంప్స్9 విజేతగా ట్రోఫీతో పాటు రూ. 10లక్షల నగదు బహుమతిని అందుకుంది. మూడేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారి తన ముద్దులొలికే గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రశంసలు అందుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శంకర్ మహాదేవన్ సైతం దోహ్నాని 'మినీ సునిధి చౌహాన్' అంటూ పేరు కూడా పెట్టారు. తాజాగా సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా నిలవడంతో సిక్కీం ముఖ్యమంత్రి, ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు దోహ్నాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టైటిల్ విన్నర్‌గా నిలిచిన దోహ్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదు. నిజానికి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. కార్టూన్స్ షోస్‌లో సాంగ్స్ వింటూ సంగీతంపై ఆసక్తి కలిగింది. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు' అంటూ పేర్కొంది. ఏదో ఒకరోజు సింగర్ సునిధి చౌహాన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. -
'జీ సరిగమప' విన్నర్ శృతిక సముద్రాల ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే? -
'జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్‌గా శృతిక సముద్రాల
సుమారు 26 వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. ప్రెస్టీజియస్ 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. 6 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా, శృతిక మాట్లాడుతూ... "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపింది. ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి. సుశీల, శృతి హాసన్, నితిన్, కృతి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల తాను సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ నిర్వహించిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా మాజీ సైనికులకు చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. -
ఆటా నాదం పాటల పోటీల విజేతలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన “ఆటా నాదం” పాటల పోటీల్లో ఫైనల్ రౌండ్లో 13 మంది గాయనీగాయకులు పాల్గొనగా.. విజేతలుగా ప్రథమ స్థానంలో కే ప్రణతి, ద్వితీయ స్థానంలో దాసరి మేఘన నాయుడు, తృతీయ స్థానంలో వెంకట సాయి లక్ష్మి, పాసాల హర్షిత, అవసరాల అభినవ్‌లు నిలిచారు. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహారించారు. ఆటా మహాసభల సన్నహాక కార్యక్రమములో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీగాయకులకు ప్రోత్సహాం అందించేందుకు ఆటా నాదం పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 200ల మంది గాయనీ గాయకులు పాల్గొన్నారు. రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” సాంస్కృతిక కార్యక్రములో విజేతలకు పాడే అవకాశం ఆటా కల్పిస్తోంది. -
‘తరాన సిరీస్2’ ఆల్బమ్ విడుదల
డల్లాస్ : తరాన రెండో సిరీస్ ఆల్బమ్ జూన్ 23న డల్లాస్‌లోని సెయింట్ మేరీస్ మలంకర ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా విడుదల కానుంది. ఈ తరానా, డల్లాస్ డ్రీమ్ ఆధ్వర్యంలో శారద సింగిరెడ్డి సారధ్యంలో ప్రవాస భారతీయుల బాల బాలికలలో ఉన్నసృజనాత్మకత గాన కళను ప్రోత్సహించి, ఉన్నత అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆల్బమ్స్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల రూపొందిస్తారు. 2016లో మొదలై ఇప్పటి వరకు రెండు తరాన ఆల్బమ్స్‌ను పూర్తి చేసుకుంది. అందులో మొదటి సిరీస్‌లో 13 మంది, రెండవ సిరీస్‌లో 28 ఉత్తమ గాయనీ గాయకులను తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు ఐదుగురికి సినిమాలో నేపధ్య గానం చేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. వీరందరికి గాయకుడు మోహన్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల పాటల విషయంలో ఉన్నతమైన ఆర్కేస్ట్రేషన్ బృందాలతో సంగీతాన్ని అందించారు. తరాన రెండు సిరీస్‌లో కలిపి సుభాష్ నారాయణ్, ఇంజపూరి, లక్ష్మీ ప్రియాంక, కృష్ణ ప్రసాద్, గడ్డం వీరు, గిరిధర్, ఇస్మాయిల్ మీర్జా, అఖిలేష్ రెడ్డి, గౌరివందన, దేశపతి శ్రీనివాస్, అరవింద్ రామ్, దినేష్, సుహాసిని విలువలు కలిగిన సాహిత్యాన్ని అందించారని తెలిపారు. -
'అబ్బ.. నా కల నెరవేరబోతుంది'
న్యూఢిల్లీ: లైవ్‌లో ఆడియెన్స్ ముందు ఓ రాక్ స్టార్ లా పాటలపాడుతూ ఉర్రూతలూరించాలని తానెప్పుడూ కలగంటూ ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అంది. జూన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో ఆమె మైకు అందుకోని పాట పాడబోతోంది. దీనికి సంబంధించిన కబుర్లు చెప్పిన సోనాక్షి 'ఆ వేడుక కోసం నేను అంతా సిద్ధం చేసుకున్నాను. ఓ వేదిక మీద రాక్ స్టార్‌లాగా పాడాలన్న నా కోరిక నెరవేరబోతుంది.. అందుకే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆ వేడుక కోసం రోజులు ఎంత తొందరగా అయిపోతే అంతబాగుండనిపిస్తుంది' అని ఆమె చెప్పింది.