
'అబ్బ.. నా కల నెరవేరబోతుంది'
న్యూఢిల్లీ: లైవ్లో ఆడియెన్స్ ముందు ఓ రాక్ స్టార్ లా పాటలపాడుతూ ఉర్రూతలూరించాలని తానెప్పుడూ కలగంటూ ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అంది. జూన్లో మూడు రోజులపాటు జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో ఆమె మైకు అందుకోని పాట పాడబోతోంది.
దీనికి సంబంధించిన కబుర్లు చెప్పిన సోనాక్షి 'ఆ వేడుక కోసం నేను అంతా సిద్ధం చేసుకున్నాను. ఓ వేదిక మీద రాక్ స్టార్లాగా పాడాలన్న నా కోరిక నెరవేరబోతుంది.. అందుకే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆ వేడుక కోసం రోజులు ఎంత తొందరగా అయిపోతే అంతబాగుండనిపిస్తుంది' అని ఆమె చెప్పింది.