డల్లాస్ : తరాన రెండో సిరీస్ ఆల్బమ్ జూన్ 23న డల్లాస్‌లోని సెయింట్ మేరీస్ మలంకర ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా విడుదల కానుంది. ఈ తరానా, డల్లాస్ డ్రీమ్ ఆధ్వర్యంలో శారద సింగిరెడ్డి సారధ్యంలో ప్రవాస భారతీయుల బాల బాలికలలో ఉన్నసృజనాత్మకత గాన కళను ప్రోత్సహించి, ఉన్నత అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆల్బమ్స్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల రూపొందిస్తారు.
2016లో మొదలై ఇప్పటి వరకు రెండు తరాన ఆల్బమ్స్‌ను పూర్తి చేసుకుంది. అందులో మొదటి సిరీస్‌లో 13 మంది, రెండవ సిరీస్‌లో 28 ఉత్తమ గాయనీ గాయకులను తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు ఐదుగురికి సినిమాలో నేపధ్య గానం చేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. వీరందరికి గాయకుడు మోహన్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల పాటల విషయంలో ఉన్నతమైన ఆర్కేస్ట్రేషన్ బృందాలతో సంగీతాన్ని అందించారు. తరాన రెండు సిరీస్‌లో కలిపి సుభాష్ నారాయణ్, ఇంజపూరి, లక్ష్మీ ప్రియాంక, కృష్ణ ప్రసాద్, గడ్డం వీరు, గిరిధర్, ఇస్మాయిల్ మీర్జా, అఖిలేష్ రెడ్డి, గౌరివందన, దేశపతి శ్రీనివాస్, అరవింద్ రామ్, దినేష్, సుహాసిని విలువలు కలిగిన సాహిత్యాన్ని అందించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment