
సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా తొమ్మిదేళ్ల చిన్నారి జెట్‌షెన్ దోహ్నా నిలిచింది. సిక్కింకు చెందిన ఈ చిన్నారి లిటిల్ చాంప్స్9 విజేతగా ట్రోఫీతో పాటు రూ. 10లక్షల నగదు బహుమతిని అందుకుంది. మూడేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారి తన ముద్దులొలికే గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రశంసలు అందుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శంకర్ మహాదేవన్ సైతం దోహ్నాని 'మినీ సునిధి చౌహాన్' అంటూ పేరు కూడా పెట్టారు.
తాజాగా సరిగమప లిటిల్ చాంప్స్9 విజేతగా నిలవడంతో సిక్కీం ముఖ్యమంత్రి, ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు దోహ్నాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టైటిల్ విన్నర్‌గా నిలిచిన దోహ్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదు. నిజానికి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను.
కార్టూన్స్ షోస్‌లో సాంగ్స్ వింటూ సంగీతంపై ఆసక్తి కలిగింది. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు' అంటూ పేర్కొంది. ఏదో ఒకరోజు సింగర్ సునిధి చౌహాన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment