'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment