![Shehnaaz Gill Finally Reacts On Dating Rumours with Raghav Juyal - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/shehnaazgill.jpg.webp?itok=-LqJVZ9w)
షెహనాజ్ గిల్.. ఈ పేరు వినగానే చాలామందికి సిద్దార్థ్ శుక్లా గుర్తుకు వస్తాడు. అంతలా వీరి జంట పాపులర్ అయింది బిగ్‌బాస్ షోతో. కానీ షెహనాజ్‌ను ఒంటరి చేస్తూ నటుడు సిద్దార్థ్ శుక్లా చిన్నవయసులోనే తనువు చాలించాడు. ప్రియుడి మరణంతో ఎంతగానో కుమిలిపోయిన షెహనాజ్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి తన పనిలో నిమగ్నమైంది. అయితే ఆమె టీవీ యాంకర్, కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్‌తో కొంచెం క్లోజ్‌గా కనిపించడంతో అతడితో డేటింగ్ చేస్తుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన షెహనాజ్‌కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో చిర్రెత్తిపోయిన నటి.. 'ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు? ఒకరి పక్కన నిల్చున్నామంటే వారితో రిలేషన్‌లో ఉన్నామనే అర్థమా? మేమిద్దరం కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్లేనా? కాదు కదా! ఇలా వాగితే నాకు పిచ్చి కోపం వస్తుంది' అని ఆగ్రహించింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలో కనిపించిన షెహనాజ్ చివరగా హోంస్లా రఖ్ అనే పంజాబీ చిత్రంలో నటించింది.
చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి
కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది!
Comments
Please login to add a commentAdd a comment