Fans Asked Shehnaaz Gill Will You Marry Me? See Actress Funny Reply Goes Viral - Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: నన్ను పెళ్లి చేసుకుంటే మీరు తట్టుకోలేరు.. రోజంతా స్మరించాల్సిందే!

Published Sun, Jul 31 2022 11:23 AM | Last Updated on Sun, Jul 31 2022 11:45 AM

Shehnaaz Gill Fans Asks Her Will You Marry Me?, See Actree Reply - Sakshi

షెహనాజ్‌ గిల్‌.. హిందీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. అప్పటిదాకా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తో గుర్తింపు పొందిన షెహనాజ్‌ హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌తో మరింతమందికి చేరువయ్యింది. తర్వాత ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టిన ఈ బొద్దుగుమ్మ సన్నబడి ముద్దుగుమ్మలా తయారైంది. తాజాగా ఆమె 'మసాబా మసాబా సీజన్‌ 2' వెబ్‌ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంది. ఇందులో ఓ అభిమాని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని షెహనాజ్‌కు పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. దీనికామె తనను భరించడం చాలా కష్టమని బదులిచ్చింది.

'మీరు ప్రపోజల్‌ పెడుతున్నారు సరే, మీ బయోడేటా కూడా పంపండి. కానీ నాతో అంత ఈజీయేం కాదు. ఎందుకంటే నాకు ఎదుటివారు చెప్పేది వినేంత ఓపిక ఉండదు. 24 గంటలు మీరు నన్ను పొగుడుతూనే ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నారు కానీ, తర్వాత సులువుగా బోర్‌ కొట్టేస్తాను. రోజంతా నేను వాగుతూనే ఉంటాను. మీరు దాన్ని వింటూనే ఉండాలి. మీరు కూడా నాగురించే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఒకవేళ మీరు నాగురించి మాట్లాడటం ఆపేస్తే నేను మధ్యలోనే వెళ్లిపోతాను. కాబట్టి నాతో వివాహం అంటూ కలలు కనకండి' అని సమాధానమిచ్చింది షెహనాజ్‌ గిల్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: గ్యారేజీలో అనిల్‌ కాపురం.. హీరోయిన్‌తో సునీల్‌ దత్‌ లవ్‌స్టోరీ..
అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉండరట!: మృణాల్‌ ఠాకూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement