Bigg Boss Shehnaaz Gill buys a new house, fans congratulates the actress - Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: మొదటి సినిమాతోనే ఇల్లు కొనేసిన బిగ్ బాస్ బ్యూటీ!

Published Tue, May 2 2023 7:42 PM | Last Updated on Tue, May 2 2023 8:00 PM

Bigg Boss Actress Shehnaaz Gill buys a new house Fans Congratulates Her - Sakshi

ఇటీవల సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‍అయితే తాజాగా ఆమె ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది బిగ్ బాగ్ బ్యూటీ. విదేశాల్లోని స్నేహితులు సైతం ఆమెను అభినందించారు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. గతంలో షెహనాజ్ ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పంజాబీ చిత్ర పరిశ్రమలో తొలినాళ్లలో పడిన ఇబ్బందులను పంచుకుంది.

షెహనాజ్ మాట్లాడుతూ.. 'నేను వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా సాధించింది ఏం లేదు. నా విధిరాత ఎప్పటికైనా మారుతుందని  భావించా.  మొదట్లో నేను సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు సెట్‌కు పిలిచి మరీ అవమానించారు.  అదేదో ముందే చెప్పాల్సింది. రమ్మని పిలిచి తీరా అలా చేయడం కరెక్ట్ కాదు. తను ఓ చిన్నపిల్ల.. మనం ఆమెను ఎలా తీసుకుంటాం అన్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఈ రోజు  రిజెక్ట్ కావడం నా మంచి కోసమే జరిగిందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా..  కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ చిత్రంలో భూమికా చావ్లా, రాఘవ్ జుయాల్, పాలక్ తివారీ నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలో విడుదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement