Urfi Javed Shares Photo Of Undereye Fillers Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Urfi Javed: ఉర్ఫీ ఏంటలా మారిపోయావ్.. అసలు నీ మొహానికి ఏమైంది?

Published Sat, Dec 31 2022 4:33 PM | Last Updated on Sat, Dec 31 2022 6:59 PM

Urfi Javed shares photo of bruises Goes Viral On Social Media - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావెద్ బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ. ఆమెపై పలువురు పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. తాజాగా మరోసారి వార్తల్లో ఉర్ఫీ జావెద్. అయితే ఈసారి తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో ప్రస్తావించింది. ఈసారి ఆమె కంటి వద్ద గాయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఉర్ఫీ మొహానికి ఏమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాలో ప్రస్తావిస్తూ.. 'నేను కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ పోయేందుకు ఓ క్రీమ్ వాడాను. అది నాకు చాలా ఎఫెక్ట్‌ అయింది. మీరనుకున్నట్లు నన్నెవరూ కొట్టలేదు. దయచేసి ఎవరూ కూడా డార్క్ సర్కిల్స్‌ క్రీమ్స్ వాడొద్దు. అదంతా ఓ స్కామ్. ప్రపంచంలోని ఏ క్రీమ్ కూడా పనికిరాదు. డార్క్ సర్కిల్స్ కోసం క్రీములు వాడొద్దంటూ' ఉర్ఫీ పోస్ట్ చేసింది. కేవలం అండర్‌ ఐ ఫిల్లర్లు లేదా ఇతర కాస్మెటిక్ విధానాలతో మాత్రమే నల్లటి వలయాలను నివారించవచ్చని ఆమె తెలిపారు.

ఉర్ఫీ కెరీర్: బాలీవుడ్ 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌తో ఉర్ఫీ ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె 'స్ప్లిట్స్‌విల్లా 14' అనే రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఆమె 'బడే భయ్యాకి దుల్హనియా', 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'బేపన్నా', 'జిజీ మా', 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'కసౌతీ జిందగీ కే' వంటి టెలివిజన్ షోలలో కూడా నటించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement