styling look
-
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్‌లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్‌తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్‌ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్‌ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్‌తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్‌కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్‌ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్‌లో కూడా కూల్‌గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్‌గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
వింటర్లో వివాహా వేడుకలు..ఇలా స్టైలిష్‌గా మారిపోండి
వివాహ వేడుకలకు ఎప్పుడూ ఒకే విధంగా ముస్తాబు అవడం బోర్ అనిపించినవారు ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. రిసెప్షన్ మొదలుకొని సంగీత్, హల్దీ, బ్రైడల్షవర్ .. అంటూ పెళ్లి వరకు ఈ వింటర్ సీజన్లో జరిగే ఒక్కో వేడుకకు ఒక్కో స్పెషల్ డ్రెస్‌తో స్టయిలిష్‌గానూ, అందంగానూ కనిపించేలా వస్తున్న డిజైన్స్‌ని ఇలా ఫాలో అయిపోవచ్చు. లాంగ్ కోట్ శీతాకాలం వెల్వెట్ లేదా బ్రొకేడ్ ఎంబ్రాయిడరీ లాంగ్ కోట్స్ అన్ని వేడుకల్లో డ్రెస్సుల మీదకు ధరించవచ్చు. చలి నుంచి రక్షణతో పాటు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోతారు. ఎంబ్రాయిడరీ ఫ్రాక్ స్టైల్ డ్రెస్సింగ్ గ్రాండ్‌గా ఉండాలనుకునేవారు ప్లెయిన్ పట్టు క్లాత్కి ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దుకోవచ్చు. లెహంగా, ఫ్రాక్, దుపట్టా పూర్తి ఎంబ్రాయిడరీ వేడుకలో రిచ్ లుక్‌ను సొంతం చేస్తుంది. పట్టు కుర్తా లెహంగా లాంగ్ స్లీవ్స్ కుర్తా, లెహంగా, దుపట్టా పట్టు కాంబినేషన్‌తో డిజైన్ చేయించుకుంటే వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఐదురోజులు జరిగే పెళ్లి వేడుకకు ఏదో ఒకరోజు మీదైన ప్రత్యేకతను చూపించవచ్చు. శారీ స్టైల్ ఒకేతరహాలో చీరకట్టు ప్రత్యేకత ఏముంది అనుకునేవారు లాంగ్ జాకెట్స్ లేదా సైడ్ కుచ్చుల అలంకరణతో స్టైలిష్ లుక్ తీసుకురావచ్చు. కట్టులో ప్రత్యేకత ఫ్లోరల్ డిజైన్స్ ఏ సీజన్‌కైనా బాగా నప్పుతాయి. సిల్క్ ఫ్లోరల్ శారీని ప్లెయిన్ వడ్డాణంతో కలిపి, అందంగా రాప్ చేస్తే.. వేడుకలో హైలైట్‌గా నిలవచ్చు. కుర్తా పైజామా క్యాజువల్ వేర్‌గా ఉండే ఈ డ్రెస్‌ను ఎంబ్రాయిడరీ, కలర్ కాంబినేషన్‌తో వెడ్డింగ్ ఔట్‌ఫిట్‌గా మార్చేయవచ్చు. ధోతీ టాప్ ఎంబ్రాయిడరీ లాంగ్ స్లీవ్స్ టాప్, బాటమ్‌గా ధోతీ ΄్యాంట్ వేడుకలో స్పెషల్ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తుంది. ధోతీ, టాప్లకు చిన్న జరీ అంచు వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు. -
స్మైలీ అండ్ స్టైలీ
తాప్సీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. స్మైలింగ్ ఫేస్. తాప్సీ ఎప్పుడూ కొత్తగా కనబడతారు. స్టైలింగ్ లుక్. ఈ స్మైలింగ్, స్టైలింగ్... సినిమాలకు కొత్త ఫ్లేవర్‌ను తెచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ఫ్లేవర్‌తో తాప్సీ స్క్రీన్ మీదకు వస్తున్నారు. వచ్చే శుక్రవారం ‘పింక్’ రిలీజ్. అందులో తాప్సీ స్మైల్‌ని, స్టైల్‌ని మించి... ఓ కొత్త యాంగిల్‌ని మీరు చూస్తారు. ఇంటర్వ్యూ చదవండి. ఆ కొత్తదనం ఏమిటో సినిమా రిలీజ్‌కు ముందే... మీకు తెలుస్తుంది! ♦ హలో తాప్సీ... చాన్నాళ్లయింది మిమ్మల్ని చూసి.. కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపిస్తున్నారు.. తాప్సీ: (నవ్వుతూ). ఈ స్టైల్ బాగుందనే అనుకుంటున్నా. ఓ సినిమా కోసం జుత్తుని కురచగా కత్తిరించు కున్నా. సినిమా కోసం ఏ హెయిర్ స్టైల్ అయినా నాకు ఓకే. అవసరమైతే డీ-గ్లామరైజ్డ్గా కూడా మారిపోతాను. ♦ చేసే క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే, ఈ మధ్య ఏ సినిమా పడితే అది చేయడం లేదేమో? నిజమేనండి. గ్లామరస్ రోల్స్ చాలా చేశా. ఇప్పుడూ అలాంటివి చేస్తా. కానీ, ఎక్కువగా నటనకు చాన్స్ ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య హిందీలో చేసిన ‘బేబీ’ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘పింక్’ ఇంకా మంచి పేరు తెస్తుంది. ♦ ‘పింక్’ అంత గొప్పగా ఉంటుందా? అమితాబ్ బచ్చన్‌గారి కాంబినేషన్ లో ఈ సినిమా చేయడం ఓ మరచిపోలేని అనుభూతి. ఇందులో నాది చాలెంజింగ్ రోల్. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి క్యారెక్టర్. రియల్ లైఫ్‌లో నాకలాంటి అనుభవాలు లేవు. కనీసం నాకు తెలిసినవాళ్ల లైఫ్‌లోనూ జరగలేదు. అందుకే ఓ విక్టిమ్ (బాధితురాలు)లా నేను ఫీలవలేను. అందువల్ల, ఈ క్యారెక్టర్ చేయడం సవాల్‌గా అనిపించింది. కోర్ట్‌లో సాగే సీన్స్‌లో ఎక్కువగా ఎమోషన్ అవడం, ఎక్కువ సీన్స్‌లో ఏడవడం.. ఇలా రియల్ లైఫ్‌లో నేను కానిది చేశాను. బాగా చేశాననే అనుకుంటున్నా. ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నా. ♦ రియల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తారు. సినిమా కోసం అందుకు విరుద్ధంగా చేసినప్పుడు ఏమనిపిస్తుంది? యాక్టర్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే.. స్క్రీన్‌పై డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్గా కనిపించవచ్చు. కాకపోతే మా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. ‘పింక్’లో నేను చేసిన అరోరా క్యారెక్టర్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. ♦ అదేంటీ.. నిజజీవితంలో మీపై లైంగిక దాడులు జరగలేదన్నారు.. ఇప్పుడీ పాత్ర మీకు దగ్గరగా ఉందంటున్నారు? చదువుకునే రోజుల్లో భయం భయంగా ఉండేదాన్ని. ఆ తర్వాత మైండ్ సెట్ మారింది. నేనెలా బతకాలని కోరుకుంటున్నానో అలానే ఉంటున్నాను. సొసైటీ గురించి పట్టించుకోను. ‘మనం ఇలా ఉంటే వాళ్లేమనుకుంటారో’ అని నా ఇష్టాలను మానుకోను. అలాగని, నేను లెక్కలేనితనంగా, ఇష్టం వచ్చినట్లుగా ఉండను. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో నేను చేసిన అరోరా పాత్ర ఫీలింగ్ కూడా అదే. న్యాయం కోసం పోరాడుతుంది. ♦ మీరు సినిమాలో పోరాడారు. రియల్‌గా లైంగిక దాడులు ఎదుర్కొనే అమ్మాయిలు పోరాటం చేస్తూనే ఉన్నారు.. అంతెందుకు మీ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన పెద్ద షాక్... నేను ఢిల్లీ అమ్మాయినే. కానీ, నా చేతిలో ఏం ఉంటుంది? ఒకవేళ ఉంటే మాత్రం క్రిమినల్స్‌కి టఫ్ పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ.. మొత్తం ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ, క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీలో మాగ్జిమమ్ వెలుగులోకొచ్చేస్తాయ్. చదువు లేకపోవడంవల్లనా? సరిగ్గా పెరగకపోవడం వల్లనా? దేనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అర్థం కావడంలేదు. కానీ, ఇలాంటి దారుణాల గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ♦ ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం మన రాజ్యాంగంలో రాసినవే దాదాపు ఇప్పటికీ పాటిస్తున్నాం. చట్టంలో సవరణలు జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ‘లా’ గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్న వ్యక్తిని. నా అభిప్రాయం ఏంటంటే... పట్టుబడితే పనిష్మెంట్ కఠినంగా ఉండాలి. అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినవాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, ఎక్కడ భయపడుతున్నారు? తప్పు చేసినవాళ్లు (నిర్భయ కేసులో దోషులు) చట్టానికి భయపడలేదు. మృగాల్లా ప్రవర్తించారు. ‘చట్టం మనల్ని ఏం చేస్తుందిలే. నచ్చింది చేసేద్దాం, ఏమీ జరగదు’ అని రెచ్చిపోయారు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనా ఇలానే ఉండి ఉంటుంది. చట్టానికి ఎప్పుడైతే భయపడతారో.. అప్పుడే వీటన్నిటికి అడ్డుకట్ట పడుతుంది. ♦ మీరు సెలబ్రిటీ కనుక చుట్టూ బాడీగార్డ్స్‌తో సేఫ్‌గా ఉంటారు.. నార్మల్ గాళ్స్‌కి సేఫ్టీ తక్కువే? ఏదైనా ప్రెస్మీట్స్, ఈవెంట్స్ అప్పుడే మాకు బాడీగార్డ్స్ ఉంటారు. విడిగా ఉండరు కదా. ముంబయ్, ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బాడీగార్డ్స్ ఉండరు. నార్మల్ గాళ్లానే ఉంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఒంటరిగానే వెళతాను. అప్పుడు సేఫ్టీ చాలా తక్కువ. ♦ సెలబ్రిటీలు బయటికొస్తే చాలు.. జనాలు గుమిగూడతారు. ఉదాహరణకు మొన్న మీరు బెంగళూరు వెళ్లినప్పుడు కొంతమంది చుట్టుముట్టేశారు... సెలబ్రిటీల లైఫ్‌లో ఇలాంటివి కామన్. మమ్మల్ని దగ్గరగా చూడాలనుకుంటారు. వీలైతే తాకాలనుకుంటారు. అదంతా అభిమానంతోనే అని నా ఫీలింగ్. ఫ్యాన్స్ ఎప్పుడూ హాని చేయాలనుకోరు. కానీ, కొంతమంది మాత్రం ఎక్కడెక్కడో టచ్ చేయాలని చూస్తారు. ఎగ్జైట్మెంట్ వలన వాళ్లను వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. అత్యుత్సాహంతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. హద్దులు దాటనంతరవకూ మాకు బాగానే ఉంటుంది. అభిమానం హద్దులు దాటితేనే అసౌకర్యంగా ఉంటుంది. ♦ ఆ సమయాల్లో మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటా. ‘టికెట్ కొని నీ సినిమా చూసే ప్రేక్షకులు వీళ్లే. తిట్టకు. వీలైతే పెదాల పైకి నవ్వు తెచ్చుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వీళ్లంతా నీవాళ్లే’ అనుకుంటాను. కోపం ఎగిరిపోతుంది. ♦ నా కూతుర్ని అలా పెంచుతా! ఐదు, పదేళ్ల తర్వాత మీరు తల్లవుతారు కదా. అప్పుడు మీకు పాప కావాలా? బాబా? నాకు పాప కావాలి. బాబు ఇష్టం కాదని కాదు. పాపని ఎందుకు కోరుకుంటున్నానంటే నేను చేయలేనివన్నీ నా కూతురు చేయాలి. చాలా హ్యాపీగా ఉండాలి. ♦ ఏంటి మీరు చేయలేకపోయినవి? నా టీనేజ్‌లో నేను భయపడుతూ బతికాను. ఎవరైనా అబ్బాయిలు కామెంట్ చేస్తే, నన్ను తప్పుగా అనుకుంటారేమోనని సంకోచం. కానీ, నా కూతురు అలా భయపడకూడదు. ‘తప్పు చేసినవాడు భయపడాలి? మనం కాదు’ అని క్లియర్‌గా చెబుతాను. మా ఇంట్లో నాకు మా అమ్మానాన్న కొన్ని హద్దులు పెట్టారు. సమాజంలో పరిస్థితులకు భయపడి అలా చేశారు. నేను వాళ్లని తప్పు పట్టడంలేదు. కానీ, నా కూతురికి మాత్రం నేను లేని పోని హద్దులు పెట్టను. స్వేచ్ఛగా బతకమంటాను. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునేంత కాన్ఫిడెన్స్‌గా పెంచుతాను. ♦ సెలబ్రిటీ కాకముందు ఎలా రియాక్ట్ అయ్యేవారు? భయపడేదాన్ని. బస్‌లో వెళుతున్నప్పుడో, పబ్లిక్ ప్లేసెస్లోనో ఎవరైనా టచ్ చేస్తే వణికిపోయేదాన్ని. ఎందుకంటే, ‘మనదే తప్పు, అందుకే ఇలా జరిగింది’ అనుకునేదాన్ని. స్టార్టింగ్ నుంచీ పేరెంట్స్ అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం వల్లే అమ్మాయిల్లో ఇలా భయం పెరుగుతుంది. అబ్బాయిలు తాకినప్పుడు ఆ అమ్మాయి మీద జాలిపడేవాళ్లు చాలా తక్కువ, అమ్మాయిదే తప్పనడానికి రెడీ అయ్యేవాళ్లు ఎక్కువ ఉంటారు. అందుకే, అబ్బాయి తప్పు చేసినా అమ్మాయి తాను తప్పు చేసినట్లుగా ఫీలవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అమ్మాయిలు తిరగబడాలి. బుద్ధి చెప్పడం మొదలుపెడితే... తాకడానికి కాదు కదా.. కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారు. ♦ అమ్మాయిలకు బోల్డన్ని హద్దులు.. అబ్బాయిలకు కావల్సినంత స్వేచ్ఛ. అబ్బాయిలకూ హద్దులు విధిస్తే బాగుంటుంది కదా? నిజంగా బాగుంటుంది. అమ్మాయిలపై దాడులు తగ్గుతాయని నా అభిప్రాయం. ఓ అమ్మాయి ఇవి చేయాలి. ఇవి చేయకూడదు. ఇక్కడికి వెళ్లాలి, అక్కడికి వెళ్లకూడదు. సన్‌సెట్ తర్వాత, లేట్ నైట్ పార్టీలకు వెళితే అంతే సంగతులు.. అంటూ అమ్మాయిలు ఏం చేయకూడదో పెద్ద లిస్ట్ ఉంది. ఇలాంటి లిస్ట్ అబ్బాయిలకు ఇవ్వలేదు. అబ్బాయిలకూ ఇస్తే, వాళ్లు విచ్చలవిడిగా తిరగరు. లేట్ నైట్స్‌లో ఇంటి పట్టునే ఉంటారు. చాలా సమస్యలు తగ్గుతాయి. ♦ ప్రొఫెషనల్‌గా హ్యాపీ. పర్సనల్‌గా సింగిల్‌గానే ఉన్నారు? పెళ్లి గురించే అడుగుతున్నారు కదా. బాలీవుడ్లో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా చాలా సాధించాలి. ♦ మ్యారేజ్‌కి రైట్ టైమ్ అనేది ఉంటుందేమో? నా దృష్టిలో పెళ్లికి టైమ్ అంటూ లేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు చేసుకోవాలి. నాకిప్పుడు అనిపించడంలేదు. ప్రొఫెషనల్‌గా బాగా వర్క్ చేశాం అనే తృప్తి లభించాక పెళ్లి చేసుకునేంత టైమ్ ఉంటుంది. అదే నాకు రైట్ టైమ్. ♦ అంటే.. పాతిక నుంచి 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం మంచిదంటారు కదా? ఆ ఆలోచనలో మార్పు రావాలి. ఏజ్ దాటుతోంది కదా అని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు, అది వర్కవుట్ అయితే ఓకే. ఫోర్డ్స్ మ్యారేజెస్ ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగుతాయి. అది మంచిది కాదు. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ♦ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా... ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనేంతగా ఫిజికల్ సిస్టమ్ సపోర్ట్ చేయదు? ఇది ఒకప్పటి మాట. 20 ఏళ్లల్లోనే కాదు.. 60 ఏళ్లల్లోనూ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంది. సైన్స్ పరంగా మంచి మార్పొచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సైన్స్, టెక్నాలజీ సపోర్ట్‌తో హ్యాపీగా తల్లి కావచ్చు. మొన్నీ మధ్యే ఓ అరవయ్యేళ్ల మహిళ తల్లయ్యారు. ♦ ఫైనల్లీ తెలుగుకి ఎందుకు దూరమయ్యారు? నేను దూరం కాలేదండి బాబూ. ప్లీజ్.. మంచి అవకాశాలివ్వండి. ఇప్పుడు నేను చేస్తున్నవాటిలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ అనే సినిమా ఒకటి. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. నటిగా నాకు సవాల్‌గా నిలిచే క్యారెక్టర్స్ ఆశిస్తున్నా. ఎవరైనా ఇస్తే, తప్పకుండా చేస్తా. - డి.జి. భవాని