మూడేళ్ల తర్వాత ఆ బేనర్లో...! | Deepika Padukone soon to work with Dharma Productions | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత ఆ బేనర్లో...!

Published Sun, Mar 6 2016 10:22 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

మూడేళ్ల తర్వాత ఆ బేనర్లో...!

మూడేళ్ల తర్వాత ఆ బేనర్లో...!

‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత హిందీలో దీపికా పదుకొనే వేరే చిత్రాలు ఒప్పుకో లేదు. హాలీవుడ్ చిత్రం ‘త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్‌కేజ్’ సినిమా చేస్తూ, బిజీగా ఉన్నారామె. ఇది చేస్తుండగానే మరో హాలీవుడ్ చిత్రానికి అవకాశం వచ్చిందనే వార్త ప్రచారమవుతోంది. దాంతో ఈ ఏడాదంతా ఆమె బాలీవుడ్‌కి దూరంగా ఉంటారని చాలామంది భావించారు. అయితే, హిందీలో దీపిక ఓ చిత్రం చేయనున్నారు. గతంలో కరణ్ జోహార్ నిర్మించిన ‘ఏ జవాని హై దివాని’ చిత్రంలో నటించిన దీపిక మళ్లీ ధర్మ  ప్రొడక్షన్స్‌లో నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సంస్థలో దీపిక చేయనున్న చిత్రం ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement