![Rashi Khanna Will Star In Karan Johar Dharma Productions First Action Franchise Film Says Reports - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/18/Untitled-1.jpg.webp?itok=w6q0ahxY)
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్‌లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్‌కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్‌లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment