=11-12-13న మరువలేని జననాలు
=తల్లిదండ్రుల ఆనందం
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : వెయ్యేళ్లకోమారు వచ్చే అరుదైన 11-12-13న తమ బిడ్డలకు జన్మనిచ్చిన తల్లితండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ తేదీ అంకెలన్నీ కలిపితే తొమ్మిది సంఖ్య వస్తుంది. తొమ్మిది సంఖ్యను చాలా మంది లక్కీ నెంబర్‌గా భావిస్తారు. అత్యంత అరుదైన ఈ తేదీన గ్రహబలాలు బాగున్నాయని పండితులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కొంతమంది గర్భిణీలు కావాలనే సిజేరియన్ల ద్వారా శిశువులకు జన్మనిచ్చారు.
మచిలీపట్నం చిలకలపూడికి చెందిన నరహరశెట్టి సుగుణ సిజేరియన్ ద్వారా మగ కవలలకు జన్మనివ్వడం మరో విశేషం. అలాగే మొగల్తూరు మండలం పాతపాడుకు చెందిన రామాని జ్యోతి, పామర్రు గాంధీ ఆశ్రమంకు చెందిన పెద్ది నాగలక్ష్మి, ఆచంట మండలం వేమవరంకు చెందిన చల్లా భాగ్యశ్రీ, ఘంటసాల మండలం జీలగలగండికి చెందిన గండు సుభాషిణి మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే బందరు మండలం గొకవరంకు చెందిన మేకా నాగ పైడమ్మ, గూడూరు మండలం ముక్కొల్లుకు చెందిన అరిశెట్టి అనురాధ, మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన జన్ను రమ్యశ్రీ ఆడ శిశువులకు జన్మనిచ్చారు.
అలాగే సాధారణ ప్రసవాల ద్వారా ఆరుగురు గర్భిణిలు శిశువులకు జన్మనిచ్చారు. మచిలీపట్నం బైపాస్ రోడ్‌కు చెందిన జన్ను లలిత, నిజాంపేటకు చెందిన వాసిరెడ్డి కీర్తిరమ్య, పెడన మండలం కట్లపల్లికి చెందిన మర్రి పైడమ్మ, నాగాయలంక మండలం మెరకపాలెంకు చెందిన గాలి పావని, జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన శీలం జ్యోతి , ఖమ్మం జిల్లా ,ఎర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ముంతమాల మల్లేశ్వరి ఆడశిశువులకు జన్మనిచ్చారు. బందరు మండలం నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వేముల పార్వతి మగ శిశువుకు జన్మనిచ్చింది.
ఎంతో సంతోషంగా ఉంది
అరుదైన 11.12.13 తేదీన మగపిల్లాడికి సిజేరియన్ ద్వారా జన్మనివ్వటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజున గ్రహబలం బాగా ఉందని పండితులు చెబుతున్నారు.
-పెద్ది నాగలక్ష్మి, పామర్రు
ఆడ శిశువుకు జన్మనివ్వడం అదృష్టం
ఈ అరుదైన తేదీన సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనివ్వటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మంచి రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చాననే తృప్తి కలిగింది.
- అరిశెట్టి అనురాధ, ముక్కొల్లు
స్పెషల్ బేబీస్
Published Thu, Dec 12 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement