గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
Jul 15 2016 2:28 PM | Updated on Sep 28 2018 3:41 PM
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక చిన్నరావూరి పార్కు సమీపంలో ఉండే బాలాజీ, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అనుమానం పెంచుకున్న బాలాజీ తరచూ జ్యోతితో గొడవ పెట్టుకునే వాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో కోపంతో ఉన్న బాలాజీ భార్యను రోకలిబండతో మోది చంపాడు. ఆపై తను కూడా ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన చిన్నారులు ఏడుస్తూ స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement