
కోహెడరూరల్: ఓ మహిళను విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన జ్యోతి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన హంస, స్వరూపల వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉంటాయి. ఈ క్రమంలో వారు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణ సాయంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని ట్రాక్టర్‌లో ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకువెళ్లి స్తంభానికి కట్టి చెప్పులతో దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు 100కు కాల్ చేశారు. నిందితులు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, రమలపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment