లింగాల మండలం దిగువపల్లెకు చెందిన జ్యోతి(40)ని శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో హత్య చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో పబ్లిక్ కుళాయి వద్ద తాగునీరు పట్టుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అరటి పిలకలు కోసే ఢిల్లీ కొడవలితో దాడి చేసి హతమార్చారని ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు.
లింగాల : లింగాల మండలం దిగువపల్లెకు చెందిన జ్యోతి(40)ని శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో హత్య చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో పబ్లిక్ కుళాయి వద్ద తాగునీరు పట్టుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అరటి పిలకలు కోసే ఢిల్లీ కొడవలితో దాడి చేసి హతమార్చారని ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిని జ్యోతి, మురారిచింతల గ్రామానికి చెందిన రామాంజనేయులు, అశోక్, మస్తానయ్య, ఎన్.రామాంజనేయులు 2015 డిసెంబర్ 13న హత్య చేసి మురారిచింతల సమీపంలో ఎర్రబోటు కొండపై పూడ్చి వేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు నాలుగు నెలల పాటు రిమాండులో ఉన్నారు. ఇటీవల ఆమె రిమాండు ముగియడంతో గ్రామానికి వచ్చింది. ఆమె మళ్లీ గ్రామంలో సంచరిస్తుండటంతో కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి బంధువులు జీర్ణించుకోలేక పోయారు. దీని కారణంగానే ఆమెను హత్య చేసి ఉంటారని ఎస్‌ఐ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ తమ సిబ్బందితో పరిశీలించారు.