కేంద్రమంత్రి జైశంకర్‌తో చర్చిస్తున్న ఎంపీలు..చిత్రంలో జ్యోతి తల్లి ప్రమీలమ్మ
కర్నూలు, మహానంది: చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోయిన అన్నెం జ్యోతిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వంగా గీత తదితరులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్‌ను కలిసి విన్నవించారు. వారితో పాటు జ్యోతి తల్లి ప్రమీలమ్మ, కాబోయే భర్త అమర్‌నా«థ్‌రెడ్డి కూడా ఉన్నారు. తన కుమార్తెతో పాటు చైనాకు వెళ్లిన వారిలో ఆమె, మరో విద్యార్థి మాత్రమే అక్కడ ఉండిపోయారని ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్పందిస్తూ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి రోజూ చైనాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నామని చెప్పినట్లు అమర్‌నాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి విజ్ఞప్తి
జ్యోతి తల్లి ప్రమీలమ్మ, కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి ఢిల్లీలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా కలిశారు. జ్యోతిని ఇండియాకు త్వరగా రప్పించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. క్షేమంగా ఇంటికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment