లెట్స్‌ డూ కుమ్ముడు | ammadu lets do kummudu sensor completed | Sakshi
Sakshi News home page

లెట్స్‌ డూ కుమ్ముడు

Published Thu, May 17 2018 1:11 AM | Last Updated on Thu, May 17 2018 1:11 AM

ammadu lets do kummudu sensor completed - Sakshi

ప్రాచి, కేతన్

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలోని ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ పాట ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. కేతన్, ప్రాచి, జ్యోతి, ఆశ, డాక్టర్‌ గురుప్రసాద్, విజయ్‌ నటించారు. సింగిల్‌ మ్యాన్‌ మూవీస్‌ బ్యానర్‌పై బి.ఎస్‌.ఆర్‌. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది.

ఈ సందర్భంగా బి.ఎస్‌.ఆర్‌. మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులకు అవసరమైన అన్ని అంశాలుంటాయి. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. జూన్‌ 6న రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్‌. కుమార్, సంగీతం: విరించి సాయి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గుర్రపు విజయ్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement