prachi
-
Prachi Bhatia: జీవితాన్ని అలంకరించుకుంది
అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా. ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్ఐఎఫ్టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది. ► సంపాదిస్తూనే కాలేజీ టాపర్ అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ. ► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది. తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్సైట్లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది. ► రాయి శిల్పంగా మారినట్టు.. ‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది. -
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
తండ్రిగా ప్రమోషన్ పొందిన నటుడు..ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మహత్ రాఘవేంద్ర అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. మహత్ భార్య ప్రాచీ నిన్న (సోమవారం) ఉదయం పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని స్వయంగా మహత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'ఈరోజు ఉదయం ఓ అందమైన పిల్లాడిని దేవుడు మాకు ప్రసాదించాడు. చిన్నారి రాకతో నేను, ప్రాచీ ఆనందంలో మునిగితేలుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాన్నగా ఎంతో ఎక్సయిటెడ్గా ఉన్నాను' అని ట్వీట్ చేశాడు. చిన్నారితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక మహత్ పోస్టుపై స్పందించిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమిళ బిగ్‌బాస్-2తో మహత్ మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు డేటింగ్ అనంతరం ప్రాచీ, మహత్ 2020లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రాచీ మాజీ మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ప్రాచీ ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నారు. God has blessed us with a cute little baby boy today morning! Prachi & me are over joyed with this bundle of happiness. Thank you everyone for all your love and good wishes 🤗❤️ So excited to be a dad🤩 @meprachimishra pic.twitter.com/FWrkMC82yz — Mahat Raghavendra (@MahatOfficial) June 7, 2021 చదవండి : సమంత గుడ్‌న్యూస్ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం! పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిర్చి’ హీరోయిన్ -
తాగుబోతులు అర్ధరాత్రి నా కారును వెంబడించారు: నటి
'దియా ఔర్ బాతీ హమ్' నటి ప్రాచీ టెహ్లాన్ తనకు ఎదురైన ఓ భయంకర అనుభవాన్ని పంచుకుంది. ఓసారి తను రాత్రి కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు తాగుబోతులు తనను వెంబడించారని తెలిపింది. ఆ సమయంలో తన భర్త కూడా కారులో ఉన్నాడని, అయినప్పటికీ వాళ్లు తమను అనుసరించడం మానుకోలేదని, ఏకంగా మా ఏరియాలోకి వచ్చేశారని పేర్కొంది. అప్పుడు చాలా భయపడ్డానన్న ప్రాచీ ఆ సమయంలో వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పింది. ఫ్యామిలీ పార్టీకి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది. తాగి తందానాలు ఆడుతూ, ఇతరులను ఇబ్బందులు పెట్టే వారిని వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇలా వికృత చేష్టలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తను పుట్టి పెరిగిన ఢిల్లీ అందమైన ప్రదేశమే, కానీ అంత సురక్షితమేమీ కాదని చెప్పుకొచ్చింది. ఢిల్లీలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ప్రాచీ అక్కడ సురక్షితంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. ఢిల్లీ కంటే ముంబై అంతో ఇంతో నయమేనని అభిప్రాయపడింది. చదవండి: నో చెప్పినా ఆ డైరెక్టర్ ఇప్పటికీ వదలట్లేదు: హీరోయిన్ ‘టాలీవుడ్లో మహేశ్ ఒక్కడే డబ్బులు వెనక్కి ఇస్తాడు’ -
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చదవండి: లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు -
వ్యాపారవేత్తను పెళ్లాడిన నటి
న్యూఢిల్లీ: టీవీ నటి, ‘దియా ఔర్ బాతీ హమ్’ ఫేం ప్రాచీ తెహ్లాన్ ఓ ఇంటివారయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ సరోహను వివాహమాడారు. శుక్రవారం దేశ రాజధానిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రాచీ ఆదివారం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ‘‘మిస్టర్ అండ్ మిసెస్ సరోహా. వివాహ తేదీ: 7.8.2020’’అంటూ తమ జీవితంలోని ముఖ్య ఘట్టానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పెళ్లి సందర్భంగా వధువు ప్రాచీ ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోగా.. క్రీం కలర్ షేర్వాణీలో వరుడు రోహిత్ ఆకట్టుకున్నాడు. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత) ఈ క్రమంలో కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లితో పాటు ప్రాచీ మెహందీ, హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సైతం అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా ఢిల్లీకి చెందిన ప్రాచీ తెహ్లాన్ భారత క్రీడాకారిణిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. నెట్‌బాల్, బాస్కెట్‌బాల్ ప్లేయర్ అయిన ఆమె.. 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. నటనపై ఉన్న మక్కువతో టీవీ రంగంలో అడుగుపెట్టారు. ‘దియా ఔర్ బాతీ హమ్’(తెలుగు డబ్బింగ్- ఈతరం ఇల్లాలు) సీరియల్‌తో నటిగా ప్రాచుర్యం పొందారు.(అర్థరాత్రి కత్రినా ఇంటికి విక్కీ.. ఏదో ఉంది!) -
ప్రేయసిని వివాహమాడిన హీరో
చెన్నై : బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 ఫేమ్ మహత్ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో మహత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, పెళ్లి మూడు రోజుల క్రితం మహత్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో ప్రాచీతో తన జర్నీని వివరించాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాతో మహత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు. -
ఒక్కటయ్యాం
‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమిళ నటుడు మహత్. ఆ తర్వాత ‘బన్నీ చెర్రీ, లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’ సినిమాల్లో కనిపించారు. గతేడాది తమిళ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో గురువారం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొంతకాలంగా మహత్, మిశ్రా రిలేషన్షిప్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. పెళ్లి తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం మహత్ రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
ప్రేమికులను విడదీసిన బిగ్‌బాస్
చెన్నై : తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ బిగ్‌బాస్ మెహతా - ప్రాచీ అనే ప్రేమ జంటను విడదీసి, మెహతా - యషికా అనే మరో నూతన ప్రేమ జంటను తయారు చేసింది. ఆసక్తికరమైన ఈ ఎపిసోడ్ నిన్న ప్రసారం అయ్యింది. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మెహతా బిగ్‌బాస్ హౌస్‌కు రాకమునుపే ప్రాచీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ షోకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్తూ తాను ప్రాచీని బాగా మిస్ అవుతున్నానని తెలిపాడు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మెహతా, హౌస్‌లో మరో కంటెస్టెంట్ అయిన యషికాకి దగ్గరయ్యాడు. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు మెహతా ఇలా చెప్పడంతో యషికా అభిమానులు ప్రాచీకి తమ సానుభూతిని తెలుపుతూ సోషల్‌మీడియాలో మెసెజ్‌ల మీద మెసెజ్‌లు పెడుతున్నారంట. దాంతో ప్రాచీ, మెహతాతో తన బంధం గురించి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేసింది. ఈ లేఖలో ప్రాచీ ‘నేను ఎంతో ప్రేమించిన వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాను. మేమిద్దరం కలిసి మా భవిష్యత్ గురించి, బిగ్‌బాస్ షో గురించి ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం పబ్లిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం మెహతా యషికాని ప్రేమిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం నన్ను బాధపెట్టింది. అయితే ఇప్పుడు నేను మెహతాతో బ్రేకప్ చేసుకుంటున్నాను. అతను హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇప్పుడు మీ అందరికి నా విన్నపం ఒక్కటే.. ఇక మెహతా గురించి నన్ను అడగడం ఆపేయండి’ అంటూ నెటిజన్లను కోరారు. గతంలో కమల్‌హసన్ మెహతా, యషికాల బంధం గురించి అడగ్గా మెహతా అలాంటిది ఏం లేదని చెప్పడంతో, యషికా కన్నీళ్లు పెట్టిన సంగతి తెలిసిందే. -
చిత్రకారుడి కథ
మాజీ మిస్టర్ ఆంధ్ర బాల్వాన్, ప్రాచీ అధికారి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ సౌధం’. ఎస్.కె. మజ్నుని దర్శకునిగా పరిచయం చేస్తూ మజ్ను రెహానా బేగమ్, మజ్ను సోహ్రబ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.ఎం. ఖాజా మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో ఒక ఫైట్, ఆరు పాటలుఉన్నాయి. ఈ నెల 11న పాటలు విడుదల చేస్తాం. ఆగస్టు 9న సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక చిత్రకారుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో ఈ చిత్రకథ రాశా. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించా’’ అన్నారు దర్శకుడు మజ్ను. సాయికిరణ్, మౌనిక, సత్య ప్రకాష్, కవిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి. -
లెట్స్ డూ కుమ్ముడు
చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. కేతన్, ప్రాచి, జ్యోతి, ఆశ, డాక్టర్ గురుప్రసాద్, విజయ్ నటించారు. సింగిల్ మ్యాన్ మూవీస్ బ్యానర్‌పై బి.ఎస్.ఆర్. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా బి.ఎస్.ఆర్. మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులకు అవసరమైన అన్ని అంశాలుంటాయి. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. జూన్ 6న రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, సంగీతం: విరించి సాయి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గుర్రపు విజయ్ కుమార్. -
యువ శక్తి
రాజ్ విరాట్, ప్రాచీ జంటగా జె.మోహన్ కాంత్ దర్శకత్వంలో జి .కె.ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘సంచారి’. ప్రస్తుతం మణికొండ, నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దేశ భవిష్యత్తును మార్చే శక్తి నేటి యువతకు ఉంది. అటువంటి యువత ప్రస్తుతం చెడు మార్గంలో పయణిస్తోంది. దానికి కారణం ఏంటి? చెడును ఎలా అంతం చెయ్యాలి? అని సందేశాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. లవ్, యాక్షన్, వినోదం›– ఇలా వాణిజ్య అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రం మంచి పేరు తీసు కొస్తుం దనే నమ్మకం ఉంది. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసి, జూన్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్ గౌడ్.