యువ శక్తి
రాజ్ విరాట్, ప్రాచీ జంటగా జె.మోహన్ కాంత్ దర్శకత్వంలో జి .కె.ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘సంచారి’. ప్రస్తుతం మణికొండ, నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దేశ భవిష్యత్తును మార్చే శక్తి నేటి యువతకు ఉంది. అటువంటి యువత ప్రస్తుతం చెడు మార్గంలో పయణిస్తోంది. దానికి కారణం ఏంటి? చెడును ఎలా అంతం చెయ్యాలి? అని సందేశాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. లవ్, యాక్షన్, వినోదం›– ఇలా వాణిజ్య అంశాలుంటాయి’’ అన్నారు.
‘‘ఈ చిత్రం మంచి పేరు తీసు కొస్తుం దనే నమ్మకం ఉంది. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసి, జూన్లో రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్ గౌడ్.