ఒక్కటయ్యాం | Mahat Raghavendra gets engaged to girlfriend Prachi Mishra | Sakshi
Sakshi News home page

ఒక్కటయ్యాం

Published Fri, Apr 19 2019 12:35 AM | Last Updated on Fri, Apr 19 2019 12:35 AM

Mahat Raghavendra gets engaged to girlfriend Prachi Mishra - Sakshi

మహత్, ప్రాచీ మిశ్రా

‘లాస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమిళ నటుడు మహత్‌. ఆ తర్వాత ‘బన్నీ చెర్రీ, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’ సినిమాల్లో కనిపించారు. గతేడాది తమిళ ‘బిగ్‌బాస్‌’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా తన గాళ్‌ఫ్రెండ్‌ ప్రాచీ మిశ్రాతో గురువారం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కొంతకాలంగా మహత్, మిశ్రా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. పెళ్లి తేదీ ఇంకా అనౌన్స్‌ చేయలేదు. ప్రస్తుతం మహత్‌ రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement