
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలు ఇద్దర్నీ హతమార్చాడో దుర్మార్గుడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే మీర్‌పేట్ సుమిత్ర ఎన్‌క్లేవ్ లో నివాసం ఉంటున్న హరీందర్ గౌడ్...సోమవారం తెల్లవారుజున భార్య జ్యోతి, కుమారుడు అభితేజ్ (6), కుమార్తె సహస్ర(5)ను గొంతు నులిమి అతి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాలనీవాసులకు చెప్పి... నేరుగా మీర్‌పేట పీఎస్‌లో లొంగిపోయాడు. కాగా హరిందర్ మలక్‌పేటలో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment