
డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరితో ఫోన్ కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ కూడా పోలీసుకు ఇవ్వడానికి సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేశారు.
తను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని, అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి సిద్దమన్నారు. ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని చెప్పారు. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడని, తన కుమారుడు, కేపీ కుమారుడు కలిసి ఆడుకునే వారని జ్యోతి తెలిపారు. ఇలా ఫ్యామిలీ బాండింగ్ తప్ప కేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నుంచైనా తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు.
(చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)
కాగా, డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే చాన్స్ ఉంది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment