
భర్తను చంపిన భార్య
వర్ని మండలం మల్లారం గ్రామ పరిధిలోని పొట్టిగుట్ట తాండాలో నిద్ర మత్తులో ఉన్న భర్త కాళ్లు, చేతులను కట్టి వేసి గొంతు నులిమి
వర్ని: వర్ని మండలం మల్లారం గ్రామ పరిధిలోని పొట్టిగుట్ట తాండాలో నిద్ర మత్తులో ఉన్న భర్త కాళ్లు, చేతులను కట్టి వేసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన సోమవా రం రాత్రి చోటుచేసుకుంది. హతుడి బంధువులు, పోలీ సుల కథనం ప్రకారం.. తాండాకు చెందిన పొతాలోత్ శివలాల్(28)కు బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామానికి చెం దిన జ్యోతితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వాసు అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు ప్రారంభమయ్యయి. జ్యోతికి వివాహేతర సంబంధం ఉందనే నెపంతో పలుమార్లు పంచారుుతీ నిర్వహించినట్టు సమాచారం.
కాగా, భర్త వేధింపులు భరించలేక గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం చేసినట్టు గ్రామస్తులు చెపుతున్నా రు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకుని కాపురం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇరువురి మధ్య తర చూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి శివలా ల్ నిద్రిస్తున్న సమయంలో కొడుకు వాసును బయటకు పంపిన జ్యోతి.. తాగి న మైకంలో జాకెట్‌తో శివలాల్ కాళ్లు, చేతులు కట్టేసి, చీర తో ఉరిపెట్టి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలానికి మంగళవారం ఉదయం బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ అంజయ్య వచ్చి వివరాలు సేకరించారు. చుట్టుపక్కల వారిని, గ్రామ పెద్దలను విచారించారు. హత్యకు ఉపయోగించిన జాకెట్, చీరను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హతుడి సోదరుడు బాబూలాల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.
అనాథగా బాలుడు..
శివలాల్‌ను భార్య జ్యోతి హత్య చేయడంతో వారి ఏడేళ్ల కుమారుడు వాసు అనాథగా మారాడు. వాసు వర్ని మం డల కేంద్రంలోని ప్రయివేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. భర్తపై ఉన్న కోపం, గత మూడేళ్లుగా తనను మానసింగా వేధిస్తున్నాడనే కసితో భర్తను చంప డం తాండాలో సంచలనం కలిగించింది. అనాథగా మారి న బాలుడిని చూసి బంధువులు కంటతడి పెడుతున్నారు.