
జ్యోతి, వినయ్ పరునెళ్ల
వినయ్ పరునెళ్ల, జ్యోతి జంటగా ‘రామ రావణ రాజ్యం’ అనే సినిమా తెరకెక్కనుంది. వీ3 ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి వికాశ్ వి. దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ‘‘జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. పాత, కొత్త నటుల కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ఇది’’ అని వికావ్ వి. తెలిపారు. ఈ చిత్రానికి కనిష్క సంగీతాన్ని అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment