
యూఎస్‌లో మరోదాడి.. వరంగల్ యువతిపై కాల్పులు
అమెరికాలో జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతోంది.
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతోంది. తెలుగు యువతిపై ఓ నల్లజాతీయుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతిగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవల కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల, దక్షిణ కరోలినాలో హర్నీశ్ పటేల్, న్యూయార్క్‌లో దీప్ రాయ్ అనే సిక్కుయువకుడిపై విద్వేశపు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఓ వైపు ఈ దాడులపై భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలోనే మరో జాది వివక్ష దాడి జరగడం కలవరపెడుతోంది.