హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం | 3 Of Family Murdered In West Delhi, 1 Body Found In Cupboard | Sakshi
Sakshi News home page

హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం

Published Sun, Jan 10 2016 3:24 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం - Sakshi

హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల హత్య కలకలం రేపింది. వారిలో ఒకరి మృతదేహాన్ని హంతకులు కప్ బోర్డులో కుక్కిపెట్టారు. ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎప్పటిలాగే ఆ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి తన పనుల నిమిత్తం ఆ ఇంటికి వచ్చి తలుపుతీసి చూడగా ఆమె యజమానురాలు జ్యోతి, ఆమె కుమారుడు హత్యకు గురై కనిపించారు.

దీంతో ఆ పనిమనిషి హడలెత్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తనఖీలు చేయగా జ్యోతి భర్త సంజీవ్ కూడా హత్య గురై అతడి మృతదేహం కప్ బోర్డులో కనిపించింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును భిన్నకోణాల్లో పరిశీలిస్తున్నారు. బహుశా ఆ కుటుంబానికి బాగా తెలిసినవారే తొలుత మంచితనంగా ఇంట్లోకి వచ్చి అనంతరం ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పని మనిషిని కూడా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement