
సాక్షి, నంద్యాల : కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న జ్యోతి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం విరబూసింది. భారత వైమానిక దళం గురువారం ప్రత్యేక విమానంలో చైనా నుంచి 112 మందిని ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో కర్నూలు వాసి అన్నెం జ్యోతి ఒకరు. కూతురు క్షేమంగా తిరిగి రావడంతో జ్యోతి తల్లి ప్రమీల తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కూతురు తమ చెంతకు చేరేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డికి, అధికారులకు, మీడియాకు ప్రమీల ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఢిల్లీ నుంచి తమ కూతురిని త్వరగా పంపిస్తే అనుకున్న సమయానికి జ్యోతి వివాహం జరిపిస్తామని విజ్ఞప్తి చేశారు. (ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి)
Comments
Please login to add a commentAdd a comment