Pocha Brahmananda Reddy
-
మళ్లీ జగనే సీఎం..!
-
సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైనది కాదు: స్పీకర్
-
సామాజిక సేవలోనూ ఆదర్శంగా రెడ్లు
మాదాపూర్: వ్యాపారంలో వచ్చిన లాభాలను సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఇతర కులాల వారికి కూడా రెడ్లు ఆదర్శంగా నిలుస్తున్నారని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో రెడ్డి బిజినెస్ కాన్క్లేవ్–2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు ఆర్థికరంగ నిపుణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి మీడియా గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇటువంటి వేదిక ఏర్పాటు చేసి అందరినీ ఒక్కతాటిపైకి తేవడం మంచి విషయమన్నారు. దీనివల్ల కొత్తగా వ్యాపార రంగంలోకి వస్తున్న వారికి చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. రెడ్డి సామాజిక వర్గంలోనూ ఎందరో పేదలు ఉన్నారని... వారికి ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆర్థిక నిపుణులు, పలు కంపెనీల సీఈవోలు వ్యాపార మెళకువలను పంచుకున్నారు. వచ్చే ఐదేళ్లలో 5 వేల మంది ఔత్సాహిక వ్యాపారస్తులకు తాము ఎన్నుకున్న రంగాల్లో రాణించేందుకు ఈ కాన్క్లేవ్ తోడ్పాటునందిస్తుందని నిర్వాహకుడు భరత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్కే గ్రూప్ సీఎండీ, క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రామ్‌రెడ్డి, సౌభాగ్య గ్రూప్ సీఎండీ సీహెచ్ చంద్రారెడ్డి, టీఎస్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వీఎన్ భరత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జయంతిరెడ్డి, డాక్టర్ సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన జ్యోతి తల్లి
సాక్షి, నంద్యాల : కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న జ్యోతి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం విరబూసింది. భారత వైమానిక దళం గురువారం ప్రత్యేక విమానంలో చైనా నుంచి 112 మందిని ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో కర్నూలు వాసి అన్నెం జ్యోతి ఒకరు. కూతురు క్షేమంగా తిరిగి రావడంతో జ్యోతి తల్లి ప్రమీల తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కూతురు తమ చెంతకు చేరేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డికి, అధికారులకు, మీడియాకు ప్రమీల ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఢిల్లీ నుంచి తమ కూతురిని త్వరగా పంపిస్తే అనుకున్న సమయానికి జ్యోతి వివాహం జరిపిస్తామని విజ్ఞప్తి చేశారు. (ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి) చదవండి: కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు -
కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ
-
జ్యోతి కుటుంబానికి కేంద్ర మంత్రి భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని కర్నూలుకు రప్పించాలని నంద్యాల, అనకాపల్లి ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ వెంకట సత్యవతి పార్లమెంటులో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయజంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చైనాలో ఉన్న జ్యోతితో మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైనా ఎంబసీతోనూ మంత్రి జయశంకర్, ఎంపీ పోచా బ్రహ్మనంద రెడ్డి మాట్లాడారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కర్నూలులో జ్యోతి తల్లి ప్రమీలాదేవి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో మాట్లాడుతుంటే అస్వస్థతకు గురయ్యారు. -
చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి
సాక్షి, ఆత్మకూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. శిల్పాతో పాటు నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైల నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆత్మకూరులో అత్యధికంగా పేద కుటుంబాలు ఉన్నాయని.. వీరికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటకు కృషి చేస్తానన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మారుస్తానని చెప్పారు. అందులో భాగంగానే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు 23 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాబ్‌మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు డీఎస్సీకీ ప్రిపేర్ అవుతున్న వారికి స్థానికంగా ఉచిత కోచింగ్ ఇప్పిస్తానని చెప్పారు. నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధి శిల్పాతోనే సాధ్యమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ,వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుమునుపు వైఎస్సార్సీపీ నాయకులు శిల్పాకార్తీక్ రెడ్డి, శిల్పా భువనేశ్వరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ఆదినారాయణ, ఎంపీడీఓ కృష్టమోహన్, సీఐ కళావెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు అంజాద్‌అలీ, చిట్యాల వెంకటరెడ్డి, శరభారెడ్డి, సులేమాన్, సుల్తాన్, ఫరుక్, సురేష్, దినకర్, నాగేశ్వరరెడ్డి, డిగ్రీకళాశాల కరస్పాండెంట్ గోపిశెట్టి వసుంధర, వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ సభ్యులు స్వామి, ముర్తుజా, రెహమాన్, కలిములా పాల్గొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందివచ్చిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. పని ఏదైనా ఇష్టపడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని..ప్రయోజకులై వాటిని తీర్చాలన్నారు. – ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం జిల్లాలో మారుమూల నియోజకవర్గం శ్రీశైలమని ఆలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యే శిల్పా మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తామని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. – చల్లా రామకృష్టారెడ్డి, ఎమ్మెల్సీ -
నంద్యాల పీఠంపై పాగా వేసేదెవరు.?
సాక్షి, నంద్యాల : దేశ చరిత్రలో కీలక పదవులు అధిరోహించిన నేతలను లోక్‌సభకు పంపిన నియోజకవర్గంగా నంద్యాల లోక్‌సభ పసిద్ధి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి , మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 1952లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరి ఎంపికయ్యారు. తరువాత పలు కారణాల వల్ల నంద్యాల నియోజకవర్గం రద్దయింది. 1967లో మళ్లీ ప్రత్యేక పార్లమెంటరీ నియోజకవర్గంగా అవతరించింది. 1977లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఏపీ నుంచి ఆ పార్టీకి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా పార్లమెంట్లో ప్రవేశించారు. అనంతరం నీలం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేసి నంద్యాల నుంచి పీవీని పోటీకి ఆహ్వానించారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పీవీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక పెండేకంటి వెంకటసుబ్బయ్య ఐదు సార్లు నంద్యాల లోక్‌సభ నుంచి గెలుపొందారు. కేంద్రమంత్రిగా, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలివే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎస్పీవై రెడ్డి గెలుపొందారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. తరువాత అధికార టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ తరుపున మాండ్ర శివానందరెడ్డి, జనసేన నుంచి ఎస్పీవై రెడ్డి బరిలో నిలిచారు. దూసుకుపోతున్న పోచా వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో రైతులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లోని పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఉంది. తనకున్న పరిచయాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలరు. మాండ్రకు నయీంతో సంబంధాలు టీడీపీ నుంచి బరిలో నిలిచిన మాండ్ర ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణలో అరాచకాలు, హత్యలు చేసిన నయీంతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందారు. టీడీపీలో చేరినప్పటి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈయనకు ఏ మాత్రం అవగాహన లేదు. ఇక జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి.. టీడీపీతో లోపాయికారిగా ఒప్పందంతోనే పోటీ చేశారని గ్రామాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. – కురువ జమ్మన్న, కర్నూలు (సిటీ) -
వైఎస్సార్సీపీలోకి చల్లా, పోచా
సాక్షి, కోవెలకుంట్ల/నంద్యాల: అవుకు మండలం ఉప్పలపాడుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. చల్లా 1983వ సంవత్సరంలో పాణ్యం నియోజకవర్గం నుంచి ఒకసారి, 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా పనిచేసిన పదిహేనేళ్ల కాలంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా అప్పటి కోవెలకుంట్ల నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. కోవెలకుంట్లలో సీసీరోడ్లు, కుందూ నదిపై వంతెన, ఆయా మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించిన ఘనత చల్లాకే దక్కింది. 1952 నుంచి కోవెలకుంట్ల నియోజకవర్గానికి 14 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. రెండు పర్యాయాలు, ఆపై గెలుపొందిన ఎమ్మెల్యేల్లో చల్లా నాల్గవ స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల సమయంలో పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై.. బనగానపల్లెగా మార్పు చెందింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్న పోచా బ్రహ్మానందరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్టీ నేతలు కాటసాని, గంగుల నాని తదితరులు కోవెలకుంట్ల చివరి ఎమ్మెల్యేగానూ చల్లాకు అరుదైన గౌరవం దక్కింది. పునర్విభజన తర్వాత బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోని అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో బలమైన కేడర్ కలిగిన నేతగా ఉంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో చల్లా టీడీపీలో చేరి.. బనగానపల్లె అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు తీవ్రస్థాయిలో కృషి చేశారు. తదనంతర పరిణామాల్లో చల్లాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పార్టీలో సముచితస్థానం కల్పించకపోవడంతో ఇటీవలే టీడీపీ సభ్యత్వానికి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య, పాణ్యం, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, గుండం ప్రకాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. చల్లాతో పాటు తనయుడు చల్లా భగీరథ్‌రెడ్డి, సోదరులు చల్లా సూర్యప్రకాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లోని ముఖ్య అనుచరులు చేరారు. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చల్లా చేరికతో మరింత బలం పెరిగింది. సుపరిచితుడు పోచా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పోచా బ్రహ్మానందరెడ్డి రైతు కుటుంబంలో జన్మించారు. నంద్యాలలో భారతీ సీడ్స్ స్థాపించి రైతులకు చేదోడు వాదోడుగా నిలిచారు. నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడిగా రైతు సమస్యలపై పోరాటాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యులుగా పని చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రైతుల జీవితాలు బాగుపడతాయని పోచా బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న వైఎస్ జగన్ తపన, ఆరాటం చూసి.. ఆయన్ను సీఎం చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో వైఎస్సార్సీపీలో చేరానన్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్ సువర్ణ యుగం మళ్లీ రావాలంటే జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇవాళో రేపో వెలువడుతుం దనుకుంటున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది. గన్నవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు (ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ సోదరుడు), కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త చల్లా రామకృష్ణారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ మన్నెం మధుసూదనరావు, నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డితో సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం పార్టీలో చేరారు. ఈ చేరికలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసం, పార్టీ కార్యాలయం సందడిగా మారింది. వీరంతా వేర్వేరు సమయాల్లో జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులూ లేవు: బాలవర్థన్‌రావు తాను పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులూ లేవని, జగన్‌ను తాను ఎలాంటి హామీలు అడగలేదని కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థన్‌రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో భయానక వాతావరణం నెలకొందనీ, అలాంటి వాతావరణాన్ని తొలగించడానికే తాను వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. ఎందరో నీతివంతులు గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం:మన్నెం వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని మన్నెం మధుసూదనరావు అన్నారు. సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చి ఇవాళ పారిశ్రామికవేత్తగా ఎదిగానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జగన్ ద్వారానే సాధ్యమన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. జగన్‌పై ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంది: చల్లా నమ్మకం, విశ్వసనీయత కలిగిన జగన్‌ను ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదని చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. కడపలో నిర్మించాలనుకుంటున్న స్టీల్ ప్లాంట్ కేంద్ర సహకారం లేకుండా సాధ్యమా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చంద్రబాబు ద్వారా ప్రజలు మోసపోవాలని నిలదీశారు. నియోజకవర్గంలో తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పారు. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తాను టీడీపీలో ఒడిదుడుకులు భరించలేక వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి తెస్తానని ఆయన ధీమాగా చెప్పారు. చంద్రబాబు పాలన అవినీతి మయం: బ్రహ్మానందరెడ్డి చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమై పోయిందని, ప్రజలు ఆయన పాలనపై విసిగి వేసారి ఉన్నారని, ఈ దఫా కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని అన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సోదరుల విజయానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశ్వసిస్తున్నారని, మహానేత వైఎస్సార్ లాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజకంగా పాలన సాగిస్తారని అన్నారు.ప్రజలకు చేరువగా ఉండి, పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పార్టీలో చేరికల సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్, బి.వై.రామయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, బ్రిజేంద్రారెడ్డి, కాటసాని సోదరులు రాంభూపాల్, రామిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సజ్జల సమక్షంలో పార్టీలోకి సినీ కళాకారులు సినీనటుడు, పార్టీ కార్యదర్శి పృథ్వీరాజ్, కృష్ణుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సినీ కళాకారులు పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. కళాకారులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి, తేజస్విని, జోగినాయుడు, మదుసుధ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని వారన్నారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలపై ప్రచారం:పృథ్వీరాజ్ వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచాకాలు ప్రజలకు తెలియజేస్తామని పృథ్వీరాజ్ అన్నారు. చంద్రబాబుకు దోచుకోవటానికి ఏమి లేక ఓట్లు కూడా దోచుకొంటున్నారని చెప్పారు. ప్రజలు ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. పెదబాబు, చినబాబులకు రాబోయే రోజులు గడ్డుకాలమేనని చెప్పారు. టీడీపీపైన ప్రజల్లో ఎప్పుడూ లేనంతా వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికీ చంద్రబాబు అరాచకాలు తెలిసేలా వాడ వాడలా కళా ప్రదర్శనలిస్తామని చెప్పారు. -
వైఎస్సార్సీపీలో చేరిన వ్యాపారవేత్తలు
సాక్షి, హైదరాబాద్: జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు అన్నివర్గాల వారు ముందుకు వస్తున్నారు. రాజన్న తనయుడి పోరాట పటిమకు, నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరిని జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్‌తోనే మొదలైందని వెల్లడించారు. 2005లో యూనివర్సిటీ బోర్డ్ మెంబర్‌గా వైఎస్సార్ నియమించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు యూనివర్సిటీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశానని తెలిపారు. (వైఎస్సార్ సీపీలో చేరిన దాసరి బాలవర్థన్ రావు) ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, ఎంఎంఆర్ గ్రూపు అధినేత మన్నెం మధుసూదన్ రావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కందూరు మండలంలోని పాలకూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు అట్టడుగు స్థాయి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. వైఎస్సార్ సీపీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. (వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు) -
వైఎస్సార్సీపీలో చేరిన వ్యాపారవేత్తలు