జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు అన్నివర్గాల వారు ముందుకు వస్తున్నారు. రాజన్న తనయుడి పోరాట పటిమకు, నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరిని జగన్ ఆహ్వానించారు.