సాక్షి, హైదరాబాద్: జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు అన్నివర్గాల వారు ముందుకు వస్తున్నారు. రాజన్న తనయుడి పోరాట పటిమకు, నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరిని జగన్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్‌తోనే మొదలైందని వెల్లడించారు. 2005లో యూనివర్సిటీ బోర్డ్ మెంబర్‌గా వైఎస్సార్ నియమించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు యూనివర్సిటీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశానని తెలిపారు.
(వైఎస్సార్ సీపీలో చేరిన దాసరి బాలవర్థన్ రావు)
ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, ఎంఎంఆర్ గ్రూపు అధినేత మన్నెం మధుసూదన్ రావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కందూరు మండలంలోని పాలకూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు అట్టడుగు స్థాయి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. వైఎస్సార్ సీపీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు)
Comments
Please login to add a commentAdd a comment