జ్యోతి పూర్వజ్ కొత్త సినిమా ప్రకటన | Jyothi Poorvaj New Movie Killer Announced, Poster Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

జ్యోతి పూర్వజ్ కొత్త సినిమా ప్రకటన

Published Sun, Oct 6 2024 6:24 PM | Last Updated on Mon, Oct 7 2024 10:40 AM

Jyothi Poorvaj New Movie Announced

తెలుగు బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించి  వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో కొత్త సినిమా రానుంది.   శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా 'కిల్లర్' అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వారు అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.

పవర్ ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్‌తో ఆల్ట్రా మోడరన్‌గా డిజైన చేసిన 'కిల్లర్' మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వాజ్, ప్రజయ్ కామత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ 'కిల్లర్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement