నవాబుపేట: రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం నారెగూడలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి (24) సోమవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె భర్త రాజు అలియాస్ రవి, అతని కుటుంబ సభ్యులు చెబుతుండగా... వరకట్న వేధింపులు తట్టుకోలేక తమ కూతురు బలైపోయిందని జ్యోతి తల్లిదండ్రులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై వరకట్నవేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.