పదం పలికింది – పాట నిలిచింది
ప్రేయసిని ఎలా నవ్వాలో కోరడంలోనే, ఆమె నవ్వు అలా ఉందన్న ధ్వని ఏమైనా ఉందా ఈ
‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు’ పాటలో. 1976లో వచ్చిన ‘జ్యోతి’ కోసం ఆచార్య ఆత్రేయ రాశారిది.
‘చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా’ నవ్వాలని ఆశించారాయన. దానికి ఒక తార్కిక ముగింపుగా–
‘నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా’ అన్నారు.
ఈ పాటను ఈ నవ్వంత అందంగా పాడింది జానకి, బాలు. సంగీతం చక్రవర్తి. దర్శకుడు కె.రాఘవేంద్రరావు.
Comments
Please login to add a commentAdd a comment