ఆదిలాబాద్ జిల్లాలో పాముకాటుతో ఓ బాలిక మృతి చెందింది.
భైంసా: ఆదిలాబాద్ జిల్లాలో పాముకాటుతో ఓ బాలిక మృతి చెందింది. జిల్లాలోని తానూర్ మండల కేంద్రానికి చెందిన రమేష్ కటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రమేష్ కుమార్తె జ్యోతి(14) ను పాము కాటేసింది. అప్రమత్తమైన రమేష్ కుమార్తె ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున జ్యోతి మరణించింది. కాగా ఆస్పత్రిలో ముఖేష్ అనే వైద్యుడు బాలికకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించాడని, అందువల్లే తమ కుమార్తె మరణించిందని రమేష్ తెలిపాడు. దీంతో ఉన్నతాధికారులు వైద్యునిపై చర్యలకు సిఫారస్ చేసినట్టు సమాచారం.