నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: అమ్మ, నాన్న పోలెపల్లి వెంకటరెడ్డి, సరస్వతమ్మలది వరంగల్ జిల్లా జఫర్‌ఘడ్ మండలం నర్సింహులుగూడెం గ్రామం. మాది పేద వ్యవసాయ కుటుంబం. నాతోపాటు ఐదుగురు బుట్టువులం. ఎమర్జెన్సీలో నాన్న టీచర్ ఉద్యోగం పోయింది. మా చదువులు, కుటుంబ పోషణ భారమైంది. ఏదైనా హాస్టల్‌లో నన్ను చదివించాలనుకున్నారు. అలా హన్మకొండలోని ‘బాలసదనం’లో అవకాశముందని అక్కడికి తీసుకెళ్లారు.
అందరూ ఉండి అనాథను
బాలసదనంలో అనాథ పిల్లలకే ప్రవేశమని చెప్పారు. దాంతో తల్లిలేని పిల్ల అ ని నిర్వాహకులకు చెప్పి నాన్న అందులో చేర్పించారు. అందరూ ఉండి అనాథలా ప్రవేశం పొందాను. అమ్మ బతికే ఉన్నా హాస్టల్‌కు వచ్చిపోయే పరిస్థితి లేకపోవడం బాధించింది. అప్పుడప్పుడు వచ్చి పోయేవాళ్లలోనే అమ్మను చూసుకునేదాన్ని. పదోతరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. ఉన్నత చదువు.. ఇంకా ఎన్నో ఆలోచనలు నాలో మెదిలే సమయంలోనే 16ఏళ్ల వయస్సులోనే మా బంధువు సమ్మిరెడ్డితో పెళ్లయింది. మా ఇద్దరు పిల్లలకు పాలు కూడా పట్టలేని పరిస్థితి. అలా ఐదు రూపాయల కూలికి వ్యవసాయ పనులకు వెళ్లాను. చదువుపై ఇష్టంతో 1989లో నెహ్రూ యు వ కేంద్రం వయోజన విద్యాకార్యక్రమాలు నిర్వహించాను. *150 వేతనంతో వాలిం టర్‌గా పనిచేశా. టైలర్‌గా, విద్యావలంటీర్‌గా, సేల్స్‌గర్ల్‌గా కూడా పనిచేశారు. 1991లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ, పీజీ చదివా. అన్నా యూనివర్సిటీలో బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించాను.
అమెరికా వైపు..
మా బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో అ మెరికా వెళ్లాలని ఉండేది. 1997లో హెచ్ -1విజిటర్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టాను. విజిటర్స్ వీసాతో ఉ ద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమతించవని తెలిసి ఇబ్బం దిపడ్డాను. ముందుగా న్యూజెర్సీలో ‘మూవీటైం’అనే వీడి యోషాలోనే సేల్స్‌పర్సన్‌గా ఉద్యోగంలో చేరాను. అక్క డ ఓ గుజరాతీ కుటుంబంలో పేయింగ్‌గెస్ట్‌గా తలదాచుకున్నాను. టైప్‌రావడం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో అక్కడ పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వారి సహకారంతో ఓసాప్ట్‌వేర్ కన్సలెన్సీలో ఉద్యోగం సంపాదించాను.
తర్వాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆఫ్ అమెరికా కంపెనీలో రి క్రూటర్‌గా ఉద్యోగం దొరికింది. ఈ కంపెనీ వారి సహకారం తో ముందుగా వీసా ఎక్స్‌టెన్షన్, ఆతర్వాత వర్జీనియాలో ఏడాదికి ఆరవైవేల డాలర్ల ప్యాకేజీతో ఉద్యో గం రావడంతో అమెరికాలో సెటిలయ్యాను. 2001లో ‘కీ’ సొల్యూషన్ సాప్ట్ వేర్ కంపెనీని స్థాపించా. ప్రస్తుతం మాకంపెనీలో పనిచేస్తు న్న 65మంది ఉద్యోగులకు నెలకు కోటిన్నర రూపాయల దా కా వేతనాలు ఇస్తున్నాను. వీసా కోసం నేను పడిన ఇబ్బంది మరొకరికి రాకుండా ఉండాలనే సంస్థను స్థాపించా.
పిల్లలు అమెరికాలోనే
పిల్లలిద్దరికీ పెళ్లిళ్లలయ్యాయి. వారు అమెరికాలోనే స్థిరపడ్డారు. నేను అనాథ స్కూల్‌లో చదివాను. మా పిల్లలను ఏటా కోటి రూపాయల ఫీజులుండే విద్యాసంస్థల్లో చది వించాను. వారు కూడా ఫ్రొఫెషనల్స్‌గా పనిచేస్తున్నారు. నా విజయగాథకు అక్షర రూపమిచ్చాను. ‘అయినా...నేను ఓడిపోలేదు’ అనే పుస్తకం రాశాను. నేను అనుభవించిన ప్రతి కష్టాన్నీ ఆత్మక థగా వివరించా.
అయినా.. నేను ఓడిపోలేదు
Published Sat, Jan 4 2014 2:35 AM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
Advertisement
Advertisement